AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎవరెవరికీ అవార్డులు వచ్చాయంటే..?

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమదైన ముద్ర వేశారు. మొత్తం 11 మంది పద్మ అవార్డులు అందుకున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ నుంచి అన్నమయ్య సంకీర్తనల వారధి బాలకృష్ణ ప్రసాద్ వరకు.. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే రోహిత్ శర్మ నుంచి సామాన్య రైతు బిడ్డ రామరెడ్డి వరకు.. మొత్తం 131 మంది ప్రతిభామూర్తులకు పద్మ అవార్డులు వరించాయి.

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎవరెవరికీ అవార్డులు వచ్చాయంటే..?
Padma Awards 2026 Full List
Krishna S
|

Updated on: Jan 25, 2026 | 6:36 PM

Share

కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి గానూ పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 131 మంది ఈ అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇందులో ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్,  113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు.

సినిమా రంగానికి పట్టాభిషేకం

తెలుగు చిత్రసీమలో తమదైన ముద్ర వేసిన సీనియర్ నటులు ఈసారి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. నటకిరీటిగా పేరుగాంచిన రాజేంద్రప్రసాద్‌ను కళా విభాగంలో పద్మశ్రీ వరించింది. ప్రముఖ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ లభించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్‌ లభించింది.

కళలు, సాహిత్యం, వ్యవసాయం

కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి కళా విభాగంలో తెలంగాణ నుంచి పద్మశ్రీ వచ్చింది. అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి గానూ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పద్మశ్రీ ఇవ్వగా.. సాహిత్యం – విద్యారంగంలో కృషికి వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది. పాడి, పశుసంవర్ధక విభాగంలో వినూత్న సేవల మామడి రామరెడ్డితో పాటు కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, గూడూరు వెంకట్రావులకు తమ రంగాల్లో విశేష సేవలకు గానూ పద్మశ్రీ అందుకున్నారు.

వైద్యం – సైన్స్ విభాగాల్లో

ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్‌ ప్రకటించారు. CCMB శాస్త్రవేత్త తంగరాజ్‌కు జన్యు పరిశోధనల్లో పద్మశ్రీ దక్కింది. తెలంగాణ నుంచి డా. విజయ్ ఆనంద్‌రెడ్డికి క్యాన్సర్ చికిత్సలో విశేష కృషికి గానూ పద్మశ్రీ లభించింది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో గడ్డమనుగు చంద్రమౌళి పద్మశ్రీ వరించింది.

క్రీడారంగం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్రీడా విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించడం క్రికెట్ అభిమానులకు తీపి కబురుగా మారింది. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌కు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ లభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.