Actress Kaveri: స్నేహ, మెట్టెల సవ్వడి సీరియల్స్ నటి గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది? వీడియో వైరల్
విధి, లేడీ డిటెక్టివ్, అన్వేషిత, తరంగాలు, ఎండమావులు.. 1990లో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించిన టీవీ సీరియల్స్ ఇవి. వీటిలో నటించిన వారు కూడా ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతుంటారు. అలా 1990లో ఈటీవీలో ప్రసారమైన 'స్నేహా' సీరియల్ కూడా చాలా మందికి ఫేవరెట్.

‘స్నేహ.. స్నేహ.. స్నేహ.. చిక్కు ముడుల్లోన్నో చక్కగా విప్పే ఒకే ఒక వనిత’.. ఈ తరం జనరేషన్ కు ఈ సాంగ్ పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 లో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైన పాట ఇది. ఈటీవీలో ప్రసారమైన ‘స్నేహా’ సీరియల్ సాంగ్ ఇది. ఇందులో స్నేహ పాత్రలో కావేరి అనే నటి యాక్ట్ చేసింది. వంశీ తెరకెక్కించిన ఈ సీరియల్ ను ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీ రావు నిర్మించారు. సుమారు 200 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన ఈ సీరియల్ చాలా మందికి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సీరియల్ బాగా ఆకట్టుకుంది. అందులోనూ స్నేహ పాత్రలో కనిపించిన కావేరీ నటనకు అందరూ ముగ్ధులయ్యారు. స్నేహ తర్వాత కొన్ని తమిళ సీరియల్స్ లో నటించింది కావేరి. అలాగే కొన్ని తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులోనూ చిన్నారి ముద్దుల పాప, సాహసం (ఓల్డ్) చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ఇక ఆమె చివరిగా విజయ్ కాంత్ నటించిన సేతుపతి ఐపీఎస్ సినిమాలోయాక్ట్ చేసింది. సినిమాలలో కంటే బుల్లి తెరపై ఎక్కువగా కాలం కనిపించిన కావేరి 15 సీరియళ్లలో నటించింది.
కాగా కావేరి రాకేష్ అనే బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. 2013లో వీరి వివాహం జరిగింది. ఇంట్లో ప్రేమ వివాహానికి ఒప్పుకోక పోయేసరికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. కాగా ఒకప్పుడు బుల్లితెరపై చాలా ముద్దుగా, బొద్దుగా, చలాకీగా కనిపించిన కావేరి ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ కు దూరంగా ఉంటోన్ ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చాలా సన్నగా కనిపించింది. మొదట చాలా మంది ఆమెను గుర్తు పట్టలేదు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు.
ఆ కారణంతోనే ఇలా సన్నగా..
‘ఓ సీరియల్ చేస్తున్న సమయంలోనే మా అమ్మ చనిపోయింది. అప్పుడే నాకు పెళ్లి అయ్యింది. అదే సమయంలోనే నాకు థైరాయిడ్ సోకింది. దీనికి తోడు సోదరుడు చనిపోవడంతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లాను. అందుకే అలా లావు పెరిగిపోయాను. ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ ఆపేయడంతో బరువు తగ్గుతూ వస్తున్నాను. మళ్లీ ఆఫర్స్ వస్తే సీరియల్స్ చేయడానికి రెడీ’ అని అంటోంది కావేరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




