చక్కెర తీసుకోవడం మానేస్తే రిజల్ట్ ఇదే.. కృతి స్కిన్ సీక్రెట్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
25 January 2026
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఊహించని స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత రెండు మూడు సినిమాలతో హిట్స్ అందుకుంది. కానీ తర్వాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేదు
కొన్నాళ్లుగా తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టి. ఇప్పుడిప్పుడే తిరిగి ఫాంలోకి వస్తుంది. తాజాగా తన స్కిన్ సీక్రెట్ రివీల్ చేసింది.
శరీరాకృతితోపాటు అందం చాలా ముఖ్యమని తెలిపింది. ఫిట్నెస్, డైట్, వ్యాయమంతోపాటు శరీర ఆరోగ్యం కోసం చెక్కర తీసుకోవడం మానేసిందట.
కొన్నాళ్లపాటు చక్కెరకు దూరంగా ఉండడం వల్ల తన చర్మం హైడ్రేట్ గా కనిపించిందని.. అలాగే స్కిన్ గ్లోయింగ్ గా ఉందంటూ చెప్పుకొచ్చింది.
చక్కెరతోపాటు.. స్వీట్ ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోవడం మానేయం వల్ల చర్మ సంరక్షణతోపాటు ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపింది.
ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులోనూ తిరిగి అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలో కృతి శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్