ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మనాలీని భారీ మంచు కమ్మేసింది. తీవ్ర హిమపాతం కారణంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్, అటల్ టన్నెల్ల మధ్య 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోగా, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.