అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గంటి పెదపూడి ప్రాథమిక పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండో తరగతి చదువుతున్న దివిజాను అనే బాలిక జింక బొమ్మ మీద పడి మృతి చెందింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో బొమ్మ వద్ద ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.