బెల్లం చేసే మ్యాజిక్ ఇదే.. రోజూ తినడం వలన కలిగే లాభాలు ఇవే!

Samatha

25 January 2026

బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన చాలా మంది ఎతో ఇష్టంగా బెల్లం తింటుంటారు.

ఆరోగ్యానికి మంచిది

అయితే అసలు బెల్లం తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తినడం వలన కలిగే లాభాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

బెల్లంలో ప్రోటీన్, ఐరన్, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజు భోజనం తర్వాత లేదా భోజనానికి ముందు తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంట.

పోషకాలు పుష్కలం

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని చిన్న ముక్క తీసుకోవడం వలన ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఐరన్

అంతే కాకుండా కడుపు సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని తీసుకోవడం వలన కడుపు నొప్పి , మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

బరువు నియంత్రణ

అలాగే మహిళలు ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం వలన నెలసరి సమయంలో వచ్చే పీరియడ్స్ నొప్పి తగ్గుతుందంట. కడుపు తిమ్మిరి, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయంట.

నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం

శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా బెల్లం తినడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శ్వాస సంబంధిత అలెర్జీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శ్వాస సమస్యలు

రక్తహీనత సమస్యతో బాధపడే వారు తప్పకుండా ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం మంచిదంట. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

రక్తహీనత