5 నిమిషాలకు 6 కోట్లు. నగల బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

25 January 2026

ఒకప్పుడు అగ్ర హీరోల సరసన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు కేవలం స్పెషల్ పాటలతో దూసుకుపోతుంది ఈ హీరోయిన్.

కేవలం 5 నిమిషాల పాట కోసం దాదాపు 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. తాజాగా సొంతంగా నగల బిజినెస్ స్టార్ట్ చేసింది ఈ అమ్మడు. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ తమన్నా. 2005లో నటిగా అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. 20 ఏళ్లుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. 

 గతేడాది ఒక్క సినిమాలోనే కనిపించింది. కానీ ఏడాది పొడవునా ఆమె ట్రెండింగ్‌లో ఉంది. అందుకు కారణం ఒక్కో పాటలో డ్యాన్స్ మూమెంట్స్.

జైలర్ సినిమాలో కావాలయ్యా, ఆతర్వాత  ఆజ్ కీ రాత్, నషా, జోక్ వంటి స్పెషల్ పాటలతో ఆమె సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.

ఆజ్ కీ రాత్ పాటకు దాదాపు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుందట. ఇప్పుడు ఆమె విశాల్, డైరెక్టర్ పి సుందర్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. 

ఈ క్రమంలోనే ఇప్పుడు సొంతంగా ఫైన్ జ్యువెలరీ అనే నగల కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమం ముంబైలో జరిగింది.

ఇప్పటికే సమంత, ప్రియాంక చోప్రా, నయనతార సొంతంగా నగల బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు తమన్నా సైతం జ్యువెల్లరీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.