AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎద్దుల బండిపై వచ్చాడని చిన్నచూపు చూడొద్దు.. అతను కొన్న కారు ధర తెలిస్తే బిత్తరపోతారు

సినిమాల్లో మాత్రమే ఒక రైతు ఖరీదైన కారు కొనడానికి ఎడ్ల బండి మీద వచ్చిన సీన్ చూస్తాం.. అయితే ఇలాంటి సంఘటన రియల్ గా దర్శనం ఇస్తే.. వావ్ అంటాం.. ఒక రైతు విలువైన లగ్జరీ టయోటా వెల్‌ఫైర్ కారు కొనడానికి ఎద్దుల బండిలో వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రైతులు కూడా లగ్జరీ కారు కొని తమ జీవితంలో మరపురానిది సన్నివేశంగా మార్చుకోవచ్చని సందేశం ఇవ్వడానికి ఆయన ఈ ప్రత్యేకమైన శైలిని అవలంబించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఎద్దుల బండిపై వచ్చాడని చిన్నచూపు చూడొద్దు.. అతను కొన్న కారు ధర తెలిస్తే బిత్తరపోతారు
Viral Video
Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 8:09 PM

Share

బెంగళూరులోని ఒక రైతు ఎద్దుల బండిలో వచ్చి లగ్జరీ కారు కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను ఎద్దుల బండిలో బెంగళూరు నగరం చుట్టూ తిరిగి అందరి దృష్టిని ఆకర్షించాడు. SSR సంజు అనే రైతు ఎద్దుల బండిలో వచ్చి టయోటా వెల్‌ఫైర్ కారు కొన్నాడని చెబుతారు. SSR సంజుకి సంబంధించిన ఈ వైరల్‌గా మారింది. అయితే సంజుకి కార్లు సేకరణ హాబీ అని.. అతని వద్ద ఇప్పటికే కొత్త కార్లు చాలా ఉన్నాయని చెబుతున్నారు. కారు కొనడం అతనికి మరపురాని అనుభవంగా ఉండాలి. అంతేకాదు రైతులకు కారు ఎలా కొనాలో..ఎద్దుల బండిని ఎలా నడపాలో కూడా తెలుసనే సందేశాన్ని అందించడానికి సంజు ఇలా డిఫరెంట్ గా కారు కొనడానికి వచ్చాడు.

ఒక యూట్యూబ్ వీడియోలో “రైతు లగ్జరీ కారు కొంటున్నాడు” అనే క్యాప్షన్ ఉంది. ఈ వీడియోలో సంజు తన అబ్బాయిలతో కలిసి కారు కొంటున్నట్లు చూడవచ్చు. పసుపు రంగు పోర్షే పనామెరా, ఫోర్డ్ ముస్తాంగ్, మసెరటి లెవాంటే, టయోటా ఇన్నోవా హైక్రాస్ , టయోటా ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్ల వరుస ఎద్దుల బండిని అనుసరిస్తున్నట్లు చూడవచ్చు. రైతుకు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. ఈ వీడియోలో అతను ఒక ఆఫీసులో కూర్చుని తన అబ్బాయిలకు కొన్ని సూచనలు ఇస్తున్నట్లు కూడా చూడవచ్చు.

వీడియో ఇక్కడ చూడండి.

ఇవి కూడా చదవండి

ఆ తరువాత అక్కడి నుంచి కుర్తా, ధోవతి ధరించి, మందపాటి బంగారు గొలుసు ధరించి, ఎద్దుల బండిని నడుపుతూ కనిపించాడు. తన ఆఫీసు నుంచి సంజు నేరుగా టయోటా డీలర్‌షిప్ షోరూమ్‌కి వచ్చాడు.ఈ వీడియోలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులు అతను ఎద్దుల బండిలో వస్తున్నట్లు చూసి ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కూడా చూడవచ్చు. సంజు టయోటా డీలర్‌షిప్ మేనేజర్‌తో మాట్లాడి షోరూమ్ లోపలికి వెళ్తాడు. షాప్ లో కారు కొనడానికి అవసరమైన అన్ని పత్రాలను తనిఖీ చేసి కారు కొన్నాడు.

మరిన్ని వైరల్ వీడియో వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .