Viral Video: లీడర్స్ నిర్లక్ష్యం.. బస్ షెల్టర్ కోసం ముఖ్య అతిథిగా గేదె.. వీడియో వైరల్. దిగి వచ్చిన ప్రజాప్రతినిధులు
ఓ గ్రామంలో 40 ఏళ్లుగా బస్ షెల్టర్‌ను నిర్మించకుండా అధికారులు, శాసనసభ్యుల ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహించడమే కాదు.. తామే స్వయంగా ఓ షెల్టర్ ను నిర్మించుకున్నారు.. దాని ఓపెనింగ్ కు ఓ క గేదెను ముఖ్య అతిథిగా చేసి.. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు..

Viral Video: ప్రజలకు కావాల్సిన అవసరాలను, సదుపాయాలను కల్పించడం.. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల బాధ్యత. అయితే వారు ఎన్నికైన తర్వాత తమ బాధ్యతను విస్మరిస్తే.. ప్రజలు వారికీ తగిన విధంగా గుణపాఠం చెబుతారు అని తెలియజేసే.. ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ గ్రామంలో 40 ఏళ్లుగా బస్ షెల్టర్‌ను నిర్మించకుండా అధికారులు, శాసనసభ్యుల ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహించడమే కాదు.. తామే స్వయంగా ఓ షెల్టర్ ను నిర్మించుకున్నారు.. దాని ఓపెనింగ్ కు ఓ క గేదెను ముఖ్య అతిథిగా చేసి.. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గడగ్‌లోని బాలెహోసూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు బస్టాండ్‌ను పునరుద్ధరించమన ప్రజా ప్రతినిధులను, అధికారులను అడిగి అడిగి విసిగిపోయారు. అసలు ప్రజల విన్నపాన్ని లెక్క చేయకుండా అధికారుల అలసత్వానికి, జాప్యానికి గ్రామస్థులు విసిగిపోయారు. దీంతో గ్రామస్తులు స్వయంగా తాత్కాలిక షెల్టర్‌ను నిర్మించుకున్నారు. ప్రారంభోత్సవానికి రాజకీయ నాయకులకు బదులుగా గేదెనుపిలిచి ఆ షెల్టర్ ను ప్రారంభించారు.




వీడియో పై ఓ లుక్ వేయండి..:
Villagers from Balehosur village of Gadag Fed up with delay in restoring the bus stand, the villagers themselves built a temporary shelter and made a buffalo inaugurate it instead of a politician. pic.twitter.com/Ke9ZFPiX79
— Vijayakumar (@vijaycam) July 20, 2022
రాష్ట్రంలోని గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకాలోని బలేహోసూర్ గ్రామంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన బస్ షెల్టర్.. దాని పైకప్పు దశాబ్దం క్రితం కూలిపోయింది. బస్ షెల్టర్ డంపింగ్ యార్డుగా మారింది. దీంతో ప్రయాణికులు మండుతున్న ఎండలు, భారీ వర్షంలో నిల్చుని బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామప్ప లమాని, ఎంపి శివకుమార్ లకు బస్ షెల్టర్ ను పునర్మించమని చాలా సార్లు తాము వినతి పత్రం ఇచ్చామని రైతు నాయకుడు లోకేష్ జలవాడగి చెప్పారు. “తమ గ్రామంలో 5,000 జనాభా ఉంది. ప్రతిరోజు వందల మంది విద్యార్థులు గ్రామం నుండి చుట్టుపక్కల పట్టణాలకు ప్రయాణిస్తుంటారని గ్రామస్థులు చెప్పారు. ప్రభుత్వ ఉదాసీనతపై వినూత్న రీతిలో నిరసన తెలపాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. కొబ్బరి ఆకులతో తాత్కాలికంగా షెల్టర్ పైకప్పును నిర్మించి గేదెను ముఖ్య అతిథిగా తీసుకుని వచ్చారు. తమ నిరసనను తెలియజేడం కోసం రిబ్బన్ కటింగ్ వేడుకను కూడా నిర్వహించారు. రిబ్బన్ కటింగ్ వేడుకను గేదేతో నిర్వహించి.. ఆ రిబ్బన్ తో గేదెను అలంకరించారు. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు, శాసనసభ్యులు త్వరలో బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి క్లిక్ చేయండి