New York City: ట్రాఫిక్‌ కష్టం తగ్గించుకోవడానికి క్యాబ్‌ని వదిలి హెలికాప్టర్‌ని ఎంచుకున్న యువతి..

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరంలో కూడా ట్రాఫిక్ ఇబ్బంది తప్పదు అని తెలుస్తోంది. ఈ నగరంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ లోని భయంకరమైన ట్రాఫిక్‌ పెట్టె ఇబ్బంది నుంచి బయటపడడానికి భారతీయ సంతతికి చెందిన ఖుషీ సూరి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంభించింది. తన గమ్యస్థానమైన విమానాశ్రయానికి చేరుకోవడానికి క్యాబ్‌కు బదులుగా హెలికాప్టర్ రైడ్ ను ఎంపిక చేసుకుంది.

New York City: ట్రాఫిక్‌ కష్టం తగ్గించుకోవడానికి క్యాబ్‌ని వదిలి హెలికాప్టర్‌ని ఎంచుకున్న యువతి..
New York City Traffic
Follow us

|

Updated on: Jun 20, 2024 | 6:14 PM

ట్రాఫిక్ లో చిక్కున్నప్పుడల్లా మన దేశంలో ఇంతే.. ఇంకెప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఇంటికి చేరుకుంటామో లేదా ఆఫీసుకు చేరుకుంటాం అని ఆలోచిస్తూ ఉంటారు ప్రయాణీకులు. అయితే ట్రాఫిక్ జామ్ సమస్య భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరంలో కూడా ట్రాఫిక్ ఇబ్బంది తప్పదు అని తెలుస్తోంది. ఈ నగరంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ లోని భయంకరమైన ట్రాఫిక్‌ పెట్టె ఇబ్బంది నుంచి బయటపడడానికి భారతీయ సంతతికి చెందిన ఖుషీ సూరి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంభించింది. తన గమ్యస్థానమైన విమానాశ్రయానికి చేరుకోవడానికి క్యాబ్‌కు బదులుగా హెలికాప్టర్ రైడ్ ను ఎంపిక చేసుకుంది.

మాన్‌హాటన్ నుంచి జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలని ఖుషీ చెప్పింది. ట్రాఫిక్‌ను నివారించడానికి ఉబర్‌లో హెలికాప్టర్ రైడ్ ఎంపికను ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇదేమి పిచ్చి పని అంటారు లేదా ఆమె అంత ధనవంతురాలా? అంటూ ఆలోచిస్తారు కూడా. అయితే ఖుషీ ట్విట్టర్‌లో పంచుకున్న అనుభవాన్ని తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. సోషల్ సైట్ ఎక్స్‌లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. అందులో ఉబెర్ క్యాబ్‌లు, హెలికాప్టర్ రైడ్‌ల ఖర్చు .. ప్రయాణ సమయాన్ని పోల్చింది.

ఇవి కూడా చదవండి

హెలికాప్టర్, క్యాబ్ ఛార్జీలపై ఓ లుక్ వేయండి..

ఆ యువతి స్క్రీన్‌షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ రైడ్ కోసం అంచనా వేసిన ధర $131.99 (అంటే మన దేశ కరెంసిలో రూ. 11,023.47). ఈ క్యాబ్ లో ప్రయాణించి విమానాశ్రయానికి చేరుకోవడానికి గంట సమయం పడుతుంది. అదే సమయంలో మాన్‌హట్టన్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్ ద్వారా చేరుకోవాలంటే చెల్లించాల్సిన ధర $165 డాలర్లు (మన దేశ కరెంసిలో రూ. 13780.39), అయితే హెలికాప్టర్ ని ఎంచుకుంటే కేవలం ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయానికి తీసుకెళ్తామని సదరు కంపెనీ హామీ ఇచ్చింది.

రెండు ధరలు పోల్చి చూస్తే.. ధరల్లో పెద్దగా తేడా లేదు.. ఈ కోణం నుంచి చూస్తే ఇది ఒక తెలివైన చర్య. ఎందుకంటే రెండిటి ఛార్జీల్లో పెద్దగా తేడా లేకపోవడంతో.. ఆ అమ్మాయి ట్రాఫిక్ లో ఇరుక్కుని అలసిపోయి ప్రయాణం చేయకుండానే అతి తక్కువ సమయంలో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఖుషీకి సంబంధించిన ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు రకరకాల చర్చను సృష్టించింది. ఇంత తక్కువ ధరకే హెలికాప్టర్ రైడ్ ఆప్షన్ కూడా దొరుకుతుందా అంటూ నెటిజన్లు చాలా ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles