విజయ్ మాల్యా వారసుడికి పెళ్లి.. ఇన్ స్టాలో కాబోయే భార్యతో ఫోటోలు

సిద్దార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతను స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. వ్యాపార వేత్త విజయ్ మాల్యా పేరు దేశ ప్రజలకు సుపరిచితం. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు తీసుకొని విదేశాలకు పారిపోయినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విదేశాల్లో మాల్యా కుటుంబం జీవనం సాగిస్తోంది. విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్ధ్ మాల్యా.

విజయ్ మాల్యా వారసుడికి పెళ్లి.. ఇన్ స్టాలో కాబోయే భార్యతో ఫోటోలు

|

Updated on: Jun 20, 2024 | 5:57 PM

సిద్దార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతను స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. వ్యాపార వేత్త విజయ్ మాల్యా పేరు దేశ ప్రజలకు సుపరిచితం. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు తీసుకొని విదేశాలకు పారిపోయినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విదేశాల్లో మాల్యా కుటుంబం జీవనం సాగిస్తోంది. విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్ధ్ మాల్యా. అతను ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో ఆర్సీబీ జట్టు ఆడే మ్యాచ్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాల్గొని హల్ చల్ చేశాడు. అప్పట్లో దీపికా పదుకొనే, సిద్ధార్థ్ మాల్యా ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం వచ్చాయి. ఆ సమయంలో మీడియాలో సిద్ధార్థ్ ప్రముఖ వ్యక్తిగా మారాడు.. ఆ తరువాత కాలంలో జరిగిన పరిణామాలతో సిద్దార్థ్ కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం సిద్దార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దీనికి వెడ్డింగ్ వీక్ ప్రారంభమైందని టైటిల్ పెట్టాడు. సిద్ధార్థ్ మాల్యా పెళ్లిచేసుకోబోయే యువతి పేరు జాస్మిన్. ఆమె మాజీ మోడల్. ఆమె సిద్ధార్థ్ కు చిన్నతనం నుంచి స్నేహితురాలు. గత ఏడాది నవంబర్ నెలలో సిద్ధార్థ్ మాల్యా జాస్మిన్ కు ప్రపోజ్ చేశాడు. తాజాగా కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను సిద్ధార్థ్ మాల్యా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ఒకరినొకరు హత్తుకొని ఫ్లవర్ ఫ్రేమ్ లో పోజులిచ్చిన ఫొటోను షేర్ చేశాడు. రెండో చిత్రంలో తన ప్రియురాలి వేలికి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపుతున్న జాస్మిన్ తో కెమెరాకు ఫోజులిచ్చాడు సిద్ధార్థ్ మాల్యా. సిద్దార్థ్ మాల్యా లాస్ ఏంజెల్స్ లో జన్మించాడు. లండన్, యూఏఈలో పెరిగాడు. మాజీ నటుడు, మోడల్. అంతేకాదు.. మానసిక ఆరోగ్యంపై అతడు రెండు పుస్తకాలు రాశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమరుడైన తండ్రికి చిన్నారి వాయిస్‌ మెసేజ్‌లు

Ganga River: రూటు మార్చిన గంగా నది .. కారణమేంటంటే ??

సబ్బులు, హెయిర్‌ ఆయిల్స్‌ ధరలు పైపైకి

రాధిక మర్చంట్‌కు.. అనంత్‌ అంబానీ లవ్‌ లెటర్‌..

తన గొప్ప మనసుతో.. అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్

Follow us