అమరుడైన తండ్రికి చిన్నారి వాయిస్ మెసేజ్‌లు
9 నెలల క్రితమే అమరుడైన తన నాన్న కోసం వాయిస్ మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నాడు. ఆ చిన్నారికేం తెలుసు.. అవి తండ్రి వరకు చేరవని. తండ్రి కోసం ఆ తనయుడు పడుతోన్న ఆవేదన పంజాబ్‌లోని మొహాలీ ఇంట్లో ప్రతి ఒక్కరినీ మెలిపెడుతోంది. 19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కర్నల్ మన్‌ప్రీత్‌సింగ్ కమాండింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. అనంత్ నాగ్‌లోని కొకెన్‌నాగ్‌కు చెందిన గడోల్ అడవుల్లో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
9 నెలల క్రితమే అమరుడైన తన నాన్న కోసం వాయిస్ మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నాడు. ఆ చిన్నారికేం తెలుసు.. అవి తండ్రి వరకు చేరవని. తండ్రి కోసం ఆ తనయుడు పడుతోన్న ఆవేదన పంజాబ్‌లోని మొహాలీ ఇంట్లో ప్రతి ఒక్కరినీ మెలిపెడుతోంది. 19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కర్నల్ మన్‌ప్రీత్‌సింగ్ కమాండింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. అనంత్ నాగ్‌లోని కొకెన్‌నాగ్‌కు చెందిన గడోల్ అడవుల్లో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో చోటుచేసుకుంది. మన్‌ప్రీత్‌కు ఒక కుమారుడు, కుమార్తె. వారి ఎదుటే తండ్రి అంత్యక్రియలు జరిగినా.. ఆయన రాడనే విషయాన్ని వారు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆ పసి హృదయాలు తండ్రి కోసం తల్లడిల్లుతున్నాయి. ఏడేళ్ల కుమారుడు కబీర్.. ‘‘నాన్నా ఒకసారి ఇంటికి రా.. తర్వాత డ్యూటీకి వెళ్దువు కానీ’’ అంటూ మన్‌ప్రీత్ వాడిన నంబర్‌కు వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నాడు. వీడియో కాల్ చేయమని అడుగుతున్నాడు. వాళ్ల అమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడట. ఆ పిల్లాడి తపన నెట్టింట్లో వైరల్‌గా మారింది. సింగ్ అంత్యక్రియల సమయంలో చిన్నారి కబీర్ సైనికుడి దుస్తులు ధరించి తండ్రికి వీడ్కోలు పలికాడు. పక్కనే ఉన్న చెల్లి అన్నను అనుకరించింది. ఆ ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. అప్పట్లో ఆ దృశ్యాలను చూసిన ప్రతీఒక్కరి మనసు బరువెక్కింది. మన్‌ప్రీత్‌సింగ్ అందించిన సహకారాన్ని స్థానికులు ఇప్పటికీ తలుచుకుంటున్నారు. పంజాబ్‌లోని తమ స్వస్థలంలో తన భర్త పిల్లల పేర్లతో రెండు మొక్కలు నాటాడని, అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూడటానికి వెళ్దామని చెప్పాడని భార్య జగ్మీత్ గుర్తుచేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ganga River: రూటు మార్చిన గంగా నది .. కారణమేంటంటే ??
సబ్బులు, హెయిర్ ఆయిల్స్ ధరలు పైపైకి
రాధిక మర్చంట్‌కు.. అనంత్ అంబానీ లవ్ లెటర్..