AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ మహిళ కోటీశ్వరురాలు.. విడాకుల తర్వాత భవనం వీడి వ్యాన్‌లో జీవించడం ప్రారంభించింది ఎందుకంటే

ఈ మహిళ పేరు కైట్లిన్ పైల్. ఇటీవల కైట్లిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో విడాకుల తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పింది. వీడియోలో తాను తన జీవితంలో చాలా కష్టపడ్డానని అందుకనే సంపాదన మీదనే దృష్టి పెట్టి ఇప్పుడు తాను మొత్తం 5 మిలియన్ డాలర్లు అంటే 43 కోట్ల రూపాయలకు పైగా సంపదను సృష్టించినట్లు వెల్లడించింది కైట్లిన్ పైల్.

Viral News: ఈ మహిళ కోటీశ్వరురాలు.. విడాకుల తర్వాత భవనం వీడి వ్యాన్‌లో జీవించడం ప్రారంభించింది ఎందుకంటే
Caitlin PyleImage Credit source: Instagram/thecaitawakening
Surya Kala
|

Updated on: Jul 04, 2024 | 12:36 PM

Share

సాధారణంగా కోట్లకు అధిపతులైన యజమానులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. సకల సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇళ్లలో జీవిస్తారు. అయితే కొందరు వ్యక్తులు కోటీశ్వరులు అయినా సరే చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాంటి వారు షో ఆఫ్ కోసం అనవసరంగా డబ్బు వృధా చేయరు. ఈరోజుల్లో అలాంటి ధనవంతురాలు అంటే కోట్ల ఆస్తికి యజమాని అయిన ఓ మహిళ వార్తల్లో నిలుస్తోంది. లక్షల ఖరీదైన విలాసాలు ఉన్న భవనం ఉన్నప్పటికీ తనకు వ్యాన్‌లో నివసించడం ఇష్టమని ఆమె వెల్లడించింది. దీని వెనుక కారణం తెలుసుకుని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ మహిళ పేరు కైట్లిన్ పైల్. ఇటీవల కైట్లిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో విడాకుల తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పింది. వీడియోలో తాను తన జీవితంలో చాలా కష్టపడ్డానని అందుకనే సంపాదన మీదనే దృష్టి పెట్టి ఇప్పుడు తాను మొత్తం 5 మిలియన్ డాలర్లు అంటే 43 కోట్ల రూపాయలకు పైగా సంపదను సృష్టించినట్లు వెల్లడించింది కైట్లిన్ పైల్. తనకు బంగ్లా కూడా ఉందని.. అయితే తాను 84 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న వ్యాన్‌లో నివసించడం ఇష్టమని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ అవుతోంది

బంగ్లాలో నివసిస్తుంటే సంతోషం లేదని.. అందుకే ఇల్లు వదిలి వ్యాన్‌లోకి మారినట్లు కైట్లిన్ చెప్పింది. విలాసవంతమైన భవనాల్లో జీవించడం కంటే మానసిక ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని చెప్పింది. కైట్లిన్ షేర్ చేసిన వీడియోకి క్యాప్షన్‌ కూడా జత చేసింది. తాను విడాకుల తీసుకోవడం వలన ధనవంతురాలిని కాలేదని స్పష్టం చేసింది. తన జీవిత విధానాన్ని మరుకున్నట్లు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకున్న తర్వాత తాను వ్యాన్‌లో జీవించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడున్న సంతోషం ఇంతకు ముందెన్నడూ లేదని అంది.

అంతే కాదు.. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని ఎవరైనా తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కైట్లిన్ తెలిపింది. ఆమె షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు 6.5 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల కామెంట్స్ ను చేశారు. ఒకరు నేను మీ గురించి తెలిసి చాలా గర్వపడుతున్నాను. మీరు చేయలనుకున్నది చేయండి.. మంచి పనిని కొనసాగించండి అని మరొకరు కామెంట్ చేశారు. డబ్బు ఆనందాన్ని కొనలేదనడానికి ఇది రుజువు. ఎందుకంటే ఇది మానసిక స్థితి. మీ విజయానికి అభినందనలు అని కామెంట్స్ చేశారు కొంతమంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..