AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: డాగ్ షెల్టర్ లో పెళ్లి చేసుకున్న జంట.. 200 పైగా కుక్కలే వివాహానికి అతిధులు.. ఎక్కడంటే..

ప్రస్తుతం జరిగే పెళ్ళిళ్ళు ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ వైవాహిక జీవితంలోకి గొప్పగా ప్రవేశించాలని అనుకుంటున్నారు. దీంతో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో రాజీ లేదంటూ లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక చైనీస్ జంట చేసుకున్న పెళ్లి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వీరి పెళ్ళికి కుక్కలు అతిథులుగా హాజరయ్యాయి. ఈ చైనీస్ జంట వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral News: డాగ్ షెల్టర్ లో పెళ్లి చేసుకున్న జంట.. 200 పైగా కుక్కలే వివాహానికి అతిధులు.. ఎక్కడంటే..
Viral News
Surya Kala
|

Updated on: Jun 28, 2025 | 7:46 PM

Share

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరచిపోలేని క్షణం. ఒక ప్రత్యేకమైన రోజు. చాలా మందికి తమ వివాహం ఎలా జరగాలనే విషయంపై చాలా కలలు ఉంటాయి. కనుక తమ పెళ్లిని తాము కోరుకున్నట్లు చేసుకోవడానికి అప్పు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. వివాహం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి.. తాము కోరుకున్న విధంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా కుక్కల సమక్షంలో పెళ్లి జరుపుకోవడం చూశారా? కానీ యాంగ్, జావో అనే ఈ చైనీస్ జంట రెండు వందలకు పైగా కుక్కల సమక్షంలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. ఈ జంట అరుదైన వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ జంట వీధికుక్కల సమక్షంలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ జంట స్వయంగా రక్షించిన 200 కి పైగా కుక్కలు యాంగ్, జావో వివాహానికి అతిథులుగా వచ్చాయి. అవును.. నష్టాలు చవిచూసిన తర్వాత తన వ్యాపారాన్ని విడిచిపెట్టి వీధికుక్కలకు ఆశ్రయం ఇచ్చిన 31 ఏళ్ల వ్యాపారవేత్త కథ ఇది.. ఈ రోజు ఆ కుక్కలే ఈ వ్యక్తి వివాహానికి ప్రధాన అతిథులుగా హాజరయ్యాయి.

ఇవి కూడా చదవండి

17వ అంతస్తు నుంచి దూకి కుక్క మృతి

31 ఏళ్ల యాంగ్ ఒకప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త. అయితే 2020 లో అతను తన వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూశాడు. తన కింద పనిచేసే ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. దీని కారణంగా.. జీతాలు చెల్లించడానికి అతను తన సొంత ఇల్లు, రెండు కార్లను అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తన వ్యాపారంలో నష్టాలను చవిచూసిన యాంగ్, నిరాశ్రయులైన వీధి కుక్కలకు పూర్తిగా ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నాడు.

యాంగ్ చిన్నతనంలోనే తన ఐదు కుక్క పిల్లలను అనారోగ్యంతో కోల్పోయాడు. ఆ సంఘటనే అతను సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రేరణనిచ్చింది. యాంగ్ వీధి కుక్కలను రక్షించి, వాటిని సంరక్షించి వాటికి ఆశ్రయం ఇవ్వడం మొదలు పెట్టాడు. కేవలం పది కుక్కలతో ప్రారంభమైన.. నేడు రెండు వందలకు పైగా కుక్కలకు పెరిగింది. ఈ కుక్కలను సంరక్షించడానికి స్వచ్ఛంద సేవకులను నియమిస్తారు.

2022లో విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన 25 ఏళ్ల జావో స్వచ్ఛంద సేవకురాలిగా చేరింది. రోజులు గడిచేకొద్దీ యాంగ్, జావో మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీధి కుక్కలను రక్షించే ప్రచారంలో ఇద్దరూ చేతులు కలిపారు. మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంట మే 25న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు తమ వివాహానికి ఈ డాగ్ షెల్టర్‌ను ఎంచుకున్నారు. వారు వ్యక్తిగతంగా కుక్కలను రక్షించి, ఆశ్రయం ఇచ్చిన ఈ స్థలాన్ని వివాహ వేదికగా మార్చి తద్వారా వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.

View this post on Instagram

A post shared by 8days (@8dayssg)

8dayssg అనే ఖాతాలో చైనీస్ జంట వివాహానికి సంబందించిన ఈ ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ముప్పై వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ జంటకు కుక్కల పూర్తి ఆశీస్సులు ఉంటాయని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు ఇంత ప్రత్యేకమైన వివాహం గురించి నేను ఎప్పుడూ వినలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది , ప్రత్యేకమైనది వివాహానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకేముంటుంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..