AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రాత్రి పూట బైక్‌ వెళ్తుండగా పైకి దూసుకొచ్చిన భారీ ఆకారం..! గుండె ఆగినంత పనైంది

రాత్రి సమయంలో ఒక వ్యక్తి బైక్‌పై వెళుతుండగా చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటన వెనుక వస్తున్న వాహనంలో ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదృష్టవశాత్తూ బైకర్ గాయపడకుండా తప్పించుకున్నాడు. చిరుతపులి దాడి తర్వాత భయంతో పారిపోయింది.

Video: రాత్రి పూట బైక్‌ వెళ్తుండగా పైకి దూసుకొచ్చిన భారీ ఆకారం..! గుండె ఆగినంత పనైంది
Leopard Attack
SN Pasha
|

Updated on: Jul 28, 2025 | 9:01 PM

Share

రాత్రి 7 గంటల ప్రాంతంలో తిరుపతిలోని పార్క్ రోడ్‌లోని అలిపిరి జూ సమీపంలో ఓ వ్యక్తి బైక్‌ పై వెళ్తున్నాడు. సడెన్‌గా ఒక భారీ ఆకారం వచ్చి అతనిపై దాడి చేసింది. అది మరేదో కాదు.. చిరుతపులి. ఈ భయంకర దృశ్యాలు వెనుక వస్తున్న కారులోని వ్యక్తి వీడియో తీయడంతో అందులో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను @jsuryareddy అనే ఖాతాలో పోస్ట్‌ అయింది. ఒక చిరుతపులి వేగంగా వస్తున్న బైక్‌పైకి దూకుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే అద​ృష్టవశాత్తు బైకర్ గాయపడకుండా తప్పించుకున్నాడు. దాడి తర్వాత చిరుతపులి భయపడి వెనక్కి పరిగెత్తింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి