ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్‌ కేసులు, బ్యాగ్‌లు.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

హీత్రూ విమానాశ్రయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్-2లోని బ్యాగేజ్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ప్రయాణికులకు సంబంధించిన సూట్‌కేసులు, బ్యాగ్‌లు

ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్‌ కేసులు, బ్యాగ్‌లు.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2022 | 1:56 PM

సాధారణంగా ఎయిర్ పోర్టులో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.. ఎక్కడా హడావిడి లేకుండా.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి నిత్యం ఎయిర్ పోర్ట్ సిబ్బంది శ్రమిస్తూనే ఉంటారు.. కానీ ఓ ఎయిర్ పోర్టులో మాత్రం కుప్పలు కుప్పలుగా బ్యాగ్స్, షూట్ కేసులు ఉన్నాయి.. వేలాది సంఖ్యలో బ్యాగ్స్ పడి ఉండటాన్ని చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.. ఎయిర్ పోర్టులో అన్ని వేల బ్యాగ్స్, షూట్ కేసులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ? ఎందుకు అలా పడి ఉన్నాయి ? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ పోర్టులో బ్యాగ్స్ పడి ఉన్న ఫోటోస్.. వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ?..

లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్-2లోని బ్యాగేజ్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ప్రయాణికులకు సంబంధించిన సూట్‌కేసులు, బ్యాగ్‌లు వేల సంఖ్యలో ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ప్రత్యేక సిస్టమ్ ద్వారా కాకుండా వారి వారి లగేజీని తీసుకెళ్లేందుకు అక్కడే అనుమతి లేదు. దీంతో అక్కడ బ్యాగ్‌లు ఇలా పేరుకుపోయాయి. ఇక ప్రయాణికులు విమానాశ్రయం నుంచి బయటపడేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. విసుగు చెంది తమ బ్యాగ్స్ ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు “విమానాశ్రయం‌లో టెర్మినల్-2లోని అన్ని బ్యాగేజ్ బెల్ట్‌లు పని చేయడం మానేశాయి.” అని వెల్లడించాడు. ఇక చేసేది లేక.. ప్రయాణికులు అక్కడ నుంచి తమ లగేజీని తీసుకెళ్లకుండా వెళ్లాల్సి వచ్చింది. కాగా హీత్రూ విమానాశ్రయం యూకేలో అతిపెద్దది కావడం విశేషం..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.