AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరీ దేవుడో.. ఒక్క అరటి పండు ధర అక్షరాల రూ. 100..ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే..

స్కాట్‌లాండ్ టూరిస్ట్‌ హైదరాబాద్‌లోని కోఠీ, చార్మినార్‌, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాలను చుట్టేశాడు. కనిపించిన స్ట్రీట్ ఫుడ్‌ను టేస్టు చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అరటి పండ్ల వ్యాపారి ఒకరు సదరు విదేశీయుడికి ఝలక్‌ ఇచ్చాడు.. విదేశీయుడు రోడ్డుపై వెళ్తుండగా, తన వైపు వస్తున్న తోపుడు బండిపై అరటి పండ్లు పెట్టి అమ్ముతున్న వ్యక్తిని చూశాడు. అటుగా వెళ్లి పండ్లు ఎంత అని అడిగాడు. సాధారణంగా హైదరాబాద్‌లో డజన్ లెక్కలు చెబుతుంటారు. కానీ,

Viral Video: ఓరీ దేవుడో.. ఒక్క అరటి పండు ధర అక్షరాల రూ. 100..ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే..
Foreigner Shocked
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2025 | 12:34 PM

Share

అనేక పర్యాటక కేంద్రాలు, పరిసర ప్రాంతాలలో వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆహార పదార్థాలు, బట్టలు లేదా బ్యాగులు కావచ్చు, ధరలు మాత్రం ఊహించని స్థాయిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక అలాంటి ప్రదేశాల్లో విదేశీయులు, కాస్త అమాయకులైన వారు కనిపించారంటే..చాలు కొందరు వ్యాపారులు వారిని ఇట్టే బురిడీ కొట్టిస్తుంటారు. మామూలు ధరలో లభించే వస్తువులను కూడా రెట్టింపు ధరతో విక్రయిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విదేశాల నుంచి వచ్చిన ఓ ట్రైవెల్ ఇన్‌ఫ్లూయన్సర్‌ కొందరు వ్యాపారుల చేతిలో ఎలా మోసపోయాడో చూపించే సంఘటన ఈ వీడియో. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. hello@hughabroad.com పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే ఓ స్కాట్‌లాండ్ వ్యక్తి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వచ్చాడు. చాలా ప్రాంతాలు తిరుగుతూ అక్కడ పర్యాటకంతోపాటు స్థానికంగా లభించే ఫుడ్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఫేమస్‌ టూరిస్ట్ ప్రదేశాలను తిరుగుతూ అక్కడ ఉండే ఫుడ్‌ను టేస్టు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. హైదరాబాద్‌లో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Hugh Abroad (@hugh.abroad)

స్కాట్‌లాండ్ టూరిస్ట్‌ హైదరాబాద్‌లోని కోఠీ, చార్మినార్‌, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాలను చుట్టేశాడు. కనిపించిన స్ట్రీట్ ఫుడ్‌ను టేస్టు చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అరటి పండ్ల వ్యాపారి ఒకరు సదరు విదేశీయుడికి ఝలక్‌ ఇచ్చాడు.. విదేశీయుడు రోడ్డుపై వెళ్తుండగా, తన వైపు వస్తున్న తోపుడు బండిపై అరటి పండ్లు పెట్టి అమ్ముతున్న వ్యక్తిని చూశాడు. అటుగా వెళ్లి పండ్లు ఎంత అని అడిగాడు. సాధారణంగా హైదరాబాద్‌లో డజన్ లెక్కలు చెబుతుంటారు. కానీ, ఇక్కడ తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముతున్న వ్యక్తి మాత్రం అరటిపండుకు రూ.100లు అని చెప్పాడు. దాంతో కంగుతిన్న విదేశీయుడు.. మరోమారు ఒక్క అరటిపండు ధర ఎంత అని అడిగాడు.. అప్పుడు కూడా ఆ వ్యాపారి మళ్లీ హండ్రెడ్ అని చెప్పాడు. అది విన్న ఇన్‌ఫ్లూఎంజర్‌ వామ్మో ఇక్కడ చాలా కాస్ట్లీ అంటూ ఆశ్చర్యపోయాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..