AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19మంది పిల్లల తల్లి.. బిజినెస్‌ స్టడీస్‌లో డాక్టరేట్‌ పూర్తి చేసింది..! ఆమె ఎవరో తెలుసా..?

ఇందుకోసం ఆమె పగటిపూట పని చేస్తుంది. పిల్లలను చూసుకుంటుంది. అదే సమయంలో ఆమె రాత్రిపూట తన ఇ-కామర్స్ వ్యాపారం కోసం చదువుకుంటూనే పని చేస్తుంది. టెన్షన్‌, ఆందోళన తనకు ఇష్టం లేదని చెప్పింది హమ్దా అల్. దానికోసం తను తన రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటానని చెప్పింది. ఎక్కువ మంది పిల్లలకు తల్లిని, పెద్ద బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చదువుకోవాలనే కలను వదులుకోలేదని చెప్పింది.

19మంది పిల్లల తల్లి.. బిజినెస్‌ స్టడీస్‌లో డాక్టరేట్‌ పూర్తి చేసింది..! ఆమె ఎవరో తెలుసా..?
Hamda Al Ruwaili
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2025 | 11:35 AM

Share

మీకు ఏదైనా సాధించాలనే కోరిక ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అంతేకాదు.. నేర్చుకోవాలనే తపన ఉంటే.. వయస్సుతో సంబంధం లేదు. దీనిని అక్షరాల నిజమని నిరూపించారు 19 మంది పిల్లల తల్లి హమ్దా అల్ రువైలీ. సౌదీ అరేబియాకు చెందిన హమ్దా అల్ రువైలీ అనే 40 ఏళ్ల మహిళ డాక్టరేట్ పట్టా పొందారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హమ్దా అల్‌ రువైలీ విజయం. ఎందుకంటే..హమ్దా 19 మంది పిల్లల తల్లి, ఆమెకు 10 మంది కుమారులు,9 మంది కుమార్తెలు ఉన్నారు. ఆమె తన పిల్లలను పెంచుతూనే చదివింది. డాక్టరేట్‌ పట్టా పొందింది. పిల్లలను పెంచడం, చదువుతో పాటు ఆమె ఇ-కామర్స్‌ను కూడా పూర్తి చేసింది.ఇంటి పనులతో పాటు పిల్లల బాధ్యత, మరోవైపు చదువు.. ఈ పనులన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన కలను సాకారం చేసుకున్నందుకు హమ్దాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

హమ్దా అల్ రువైలీ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాధను వివరించారు.. హమ్దా తన చదువులు, కెరీర్, పిల్లల పెంపకం మధ్య ఇటీవల తన కోసం ఎలా సమయాన్ని కేటాయించింది.? దీనిపై, హమ్దా అల్ రువైలీ, 40 సంవత్సరాల వయస్సులో ఆమె తన సమయాన్ని విభజించుకుని పనిచేసినట్టుగా చెప్పింది. ఇందుకోసం ఆమె పగటిపూట పని చేస్తుంది. పిల్లలను చూసుకుంటుంది. అదే సమయంలో ఆమె రాత్రిపూట తన ఇ-కామర్స్ వ్యాపారం కోసం చదువుకుంటూనే పని చేస్తుంది. టెన్షన్‌, ఆందోళన తనకు ఇష్టం లేదని చెప్పింది హమ్దా అల్. దానికోసం తను తన రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటానని చెప్పింది. ఎక్కువ మంది పిల్లలకు తల్లిని, పెద్ద బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చదువుకోవాలనే కలను వదులుకోలేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి

పిల్లలు కూడా చదువులో ముందున్నారని చెప్పారు. తన చదువుతో పాటు పిల్లల చదువుల విషయంలోనూ హమ్దా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. తన పిల్లల గురించి హమ్దా మాట్లాడుతూ, పిల్లలు చదువులో ముందుంటారని, వారిలో అందరూ 94 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. కొందరికి 100 శాతం మార్కులు కూడా వచ్చాయని చెప్పారు.. తన కూతురు హైస్కూల్లో చదువుతున్నట్టుగా చెప్పారు. తన కూతురు కూడా రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ ది గిఫ్టెడ్ నుండి అవార్డును అందుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!