Watch: నల్లమల సఫారీ రైడ్ లో పెద్దపులి ప్రత్యక్షం.. సెల్‌ఫోన్లలో బంధించిన పర్యాటకులు
అమ్రాబాద్ వాచ్ టవర్ సమీపంలో పెద్దపులి దర్శనంతో పర్యాటకులు ఆశ్చర్యంలో ఉండిపోయారు. .పెద్దపులి ప్రత్యక్షంతో ఆనందం వ్యక్తం చేసిన సఫారీ టూర్ పర్యాటకులు.. పెద్దపులిని తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అలా కాసేపు కనిపించిన పెద్దపులి పొదల నుండి అడవిలోకి వెళ్లిపోయింది. కనిపించిన పెద్దపులి టైగర్ 19 అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారుల అంచనా వేస్తున్నారు. అభయారణ్యంలో క్రమక్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల అభయారణ్యంలో సఫారీ రైడ్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. పెద్దపుల్లిని చూసిన పర్యాటకులు సంబరపడిపోయారు.. దాంతో పాటుగానే భయంతో కూడా వణికిపోయారు. అమ్రాబాద్ వాచ్ టవర్ సమీపంలో పెద్దపులి దర్శనంతో పర్యాటకులు ఆశ్చర్యంలో ఉండిపోయారు.
వీడియో ఇక్కడ చూడండి..
పెద్దపులి ప్రత్యక్షంతో ఆనందం వ్యక్తం చేసిన సఫారీ టూర్ పర్యాటకులు.. పెద్దపులిని తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అలా కాసేపు కనిపించిన పెద్దపులి పొదల నుండి అడవిలోకి వెళ్లిపోయింది. కనిపించిన పెద్దపులి టైగర్ 19 అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారుల అంచనా వేస్తున్నారు. అభయారణ్యంలో క్రమక్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




