AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అంతా తానై తల్లికి రెండో పెళ్లి జరిపించిన తనయుడు.. వైరల్‌గా మారిన పెళ్లి వీడియో

పాకిస్థాన్‌కు చెందిన ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దేశానికి చెందిన ఓ యువకుడు.. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న తన తల్లికి రెండో పెళ్లి జరిపించాడు. తన తల్లి తన జీవితమంతా తనను పెంచడానికి అంకితం చేసిందని.. నిస్వార్థంగా జీవించిన తన తల్లికి మళ్ళీ ప్రేమని పొందే హక్కు ఉందని ఆ తనయుడు చెబుతున్నాడు. అందుకనే తన తల్లికి అందమైన జీవితం ఇవ్వానికి రెండో పెళ్లి జరిపించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: అంతా తానై తల్లికి రెండో పెళ్లి జరిపించిన తనయుడు.. వైరల్‌గా మారిన పెళ్లి వీడియో
Viral VideoImage Credit source: social media
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 31, 2024 | 3:45 PM

Share

తండ్రి దూరం కావడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న తన తల్లిని చూసి జీర్ణించుకోలేకపోయాడు ఆ తనయుడు. తన తల్లికి రెండో వివాహానికి ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్ లో అబ్దుల్ అనే యువకుడు.. తన తల్లి కళ్లలో ఆనందం చూసేందుకు ఇతరులకు భిన్నంగా ఆలోచించాడు. తన తల్లికి రెండో పెళ్లి చేయించిన అబ్దుల్.. తాను ఎందుకు ఈ పెళ్లి చేయించాల్సి వచ్చిందో తెలియజేస్తూ ఓ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

తల్లికి కొడుకు రెండో పెళ్లి ఎందుచు చేయించాడు..?

ఇవి కూడా చదవండి

18 ఏళ్ల అబ్దుల్ అహ్మద్ అనే యువకుడు తన కన్న తల్లి ఋణం తీర్చుకోవడానికి ఆమెకు మళ్ళీ అందమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంటుందంటూ రెండో పెళ్లి చేయించాడు. కొడుకు ముందుండి మరీ తన తల్లికి రెండో పెళ్లి  చేయించాడనే అనే వార్త చర్చనీయాంశంగా మారింది. తన తల్లి రెండో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర వివరాలను అబ్దుల్ స్వయంగా ఓ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ వీడియోలో తన తల్లికి ఎందుకు రెండో పెళ్లి చేయించాలని నిర్ణయం తీసుకున్నాడో తెలియజేసే ప్రయత్నం చేశాడు.

తల్లికి రెండో పెళ్లి చేయించిన తనయుడు

అబ్దుల్ తల్లికి చిన్నతనంలోనే పెళ్లి అయ్యింది. కూతురు కొడుకు పుట్టిన తర్వాత భర్త మరణించాడు. అప్పటి నుంచి ఆ పిల్లలకు తల్లీ తండ్రి అన్నీ తానై పెంచి పెద్ద చేసింది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా సరే పిల్లలకు ఎటువంటి లోటు తెలియకుండా పెంచింది. చదివించింది. తల్లి కష్టం చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలతో జీవితంలో సెటిల్ అయ్యారు. అయితే తన కోసం నిస్వార్థంగా జీవించిన తమ తల్లికి తన జీవితంలో మళ్ళీ ప్రేమని పొందే హక్కు ఉందని అబ్దుల్ తన తల్లిని పెళ్లి విషయంలో ఒప్పించి పెద్దల సమక్షంలో మరో వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..