మన దేశం నుంచి భారీగా పెరిగిన అరటి ఎగుమతులు.. ఎక్కువ ప్రయోజనం పొందిన ఆ రాష్ట్ర రైతులు
మన దేశంలో అరటి పంటకు ప్రముఖ స్థానం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అరటిని అంతర పంటగా వేస్తారు. అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాల్లో భారత దేశంతో సహా సాగు చేస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అరటి ఎగుమతులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అరటి ప్రాసెసింగ్‌లో పాల్గొనే రైతులకు కూడా ఎక్స్‌పోజర్ అవకాశాలు కల్పిస్తుస్తోంది.
హిందూ సంప్రదాయంలో అరటి పండుకు ప్రముఖ స్థానం. పూజలో,శుభకార్యాలలో మాత్రమే కాదు పండ్లలో తక్కువ ధరకు దొరికే పండు కూడా.. ఈ అరటిపండులో పోషకాలు మెండు. అజీర్తి ని, మలబద్ధకాన్ని పోగొట్టి, శరీరానికి మేలు చేస్తుంది. అరటి పండ్లను పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అరటి పండు సీజన్ లో సంబంధం లేకుండా ఏడాదిలో 365 రోజుల్లో విరివిగా లభిస్తూ ఉంటుంది. అంతేకాదు అరటి పండు ధర మిగతా పండ్లతో పోలిస్తే తక్కువే. దీనిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎన్నో పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలున్న అరటిపండును తప్పకుండా తినే ఆహారంలో భాగంగా రోజుకి ఒకటి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశం గత దశాబ్దంలో అరటిపండ్ల ఎగుమతులు పదిరెట్లు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎగుమతి గణాంకాలను, భవిష్యత్తు అంచనాలపై ఇటీవలి నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా రైతు-కేంద్రీకృత దృష్టికి అనుగుణంగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరటి సాగుని ప్రోత్సహిస్తున్నారు. డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రాన్ని అనుసరిస్తూ .. మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా అధిక-నాణ్యత గల అరటిని పండించడానికి ప్రోత్సాహకాలుగా ఆడిస్తోంది యోగి సర్కార్.
దీంతో రాష్ట్రంలో అరటి పండించే రైతులకు ఇది గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. యుపిలోని పూర్వాంచల్, అవధ్ ప్రాంతాలలో, ఖుషినగర్, డియోరియా, గోరఖ్‌పూర్, మహరాజ్‌గంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, అమేథీ, బారాబంకి వంటి జిల్లాల్లో అరటి సాగుని విస్తృతంగా చేపట్టారు. గత దశాబ్దంన్నర కాలంలో అరటి సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగింది. దీనికి కారణం.. అరటిలో మేలైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు వ్యవసాయంలో అధునిక పద్ధతులను అవలంబించడం వల్ల అరటి దిగుబడి, నాణ్యత మెరుగుపడింది.
ఇన్ని జాగ్రత్తలు తీసుకుని అరటిని సాగు చేయడం వలన రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనే కాదు దేశంలో బీహార్, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ వంటి రాష్ట్రాలతో పాటు నేపాల్‌లో కూడా యూపీలో పండిస్తున్న అరటిపండ్లకు అధిక డిమాండ్ ఉంది. అరటి సాగు కోసం యోగి సర్కార్ హెక్టారుకు సుమారు రూ.38,000 సబ్సిడీని అందిస్తుంది. అంతేకాదు అరటిపండ్లతో పండ్ల ఆధారిత వస్తువులతో పాటు, అరటి ఆకులు, కాండం, పీచు, వంటి వాటితో రకరకాల ఉత్పత్తులను తయారు చేయడానికి.. అరటిని ప్రాసెస్ చేయడానికి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
అరటి ప్రాసెసింగ్‌లో పాల్గొనే రైతులకు కూడా ఎక్స్‌పోజర్ అవకాశాలు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల కొన్ని నెలల క్రితం నోయిడాలో జరిగిన ట్రేడ్ షోలో ఖుషీనగర్‌కు చెందిన కొంతమంది రైతులు పాల్గొన్నారు.
భారతదేశంలోని అరటి రైతులకు అధిక ప్రయోజనాలను అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముంబైలో విక్రేత-కొనుగోలుదారుల సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదించింది. అదనంగా అరటిపండ్లును ప్రపంచంలోని ఇతర దేశాల వారు ఇతర ప్రాంతాల వారు దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అరటి పండ్లు నిల్వ ఉండే సామర్ధ్యాన్ని గుర్తించి వాటిని సముద్ర మార్గాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సముద్ర మార్గం ద్వారా భారతదేశ అరటి ఎగుమతులకు రష్యా ప్రధాన మార్కెట్‌గా అవతరించనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..