Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lohri 2025: భోగినే లోహ్రిగా జరుపుకునే సిక్కులు.. రైతన్నల పండగ ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. కొత్త పంటలు ఇంటికి వచ్చిన ఆనందంతో రైతులు సంతోషంగా దక్షిణాది వారు మకర సంక్రాంతి, సంక్రాంతి, పెద్ద పండగమ వంటి పేర్లతో జరుపుకుంటారు. అయితే ఉత్తరాది వారు కూడా ఈ పండగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతిని లోహ్రీ పండగగా సిక్కులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున, రైతులు కొత్త సంవత్సరంలో మంచి పంటలు పండాలని దేవుడిని ప్రార్థిస్తారు. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరంలో లోహ్రీని ఏ రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం. ఈ పండుగకు అంత ప్రాధాన్యత ఎందుకో తెలుసా..

Lohri 2025: భోగినే లోహ్రిగా జరుపుకునే సిక్కులు.. రైతన్నల పండగ ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
Lohri 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2024 | 10:01 AM

మకర సంక్రాంతి పండుగను హిందువులు మాత్రమే కాదు లోహ్రి పండగగా సిక్కులు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఎంతో వైభవంగా ఈ పండగను జరుపుకుంటారు. లోహ్రీ పండుగ ఉత్తర భారతదేశంలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. లోహ్రీ శీతాకాలపు అయనాంతం ముగింపు.. రబీ పంట కోతకు వచ్చి పంట ఇంటికి వచ్చినందుకు గుర్తుగా జరుపుకుంటారు. లోహ్రీ పండుగ రోజున హిందూ, సిక్కు ప్రజలు కొత్త బట్టలు ధరించి డ్యాన్స్ చేస్తారు. పాటలు పాడతారు.

2025లో లోహ్రీ ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం లోహ్రీ పండుగను మకర సంక్రాంతికి ఒక రోజు ముందు అంటే మనం భోగిగా జరుపుకునే రోజున లోహ్రిగా జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరంలో కూడా లోహ్రీ పండగను జనవరి 13న జరుపుకోనున్నారు. నూతన సంవత్సరంలో జనవరి 14న సూర్యభగవానుడు రాత్రి 8.44 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

లోహ్రీ పండగ ప్రాముఖ్యత

లోహ్రీ పండుగ సూర్యుడు, అగ్నికి అంకితం చేయబడింది. లోహ్రీ పండగ రోజున రైతులు తమ కొత్త పంటలను ఇంటికి తీసుకుని వస్తారు. అంతేకాదు కొత్త పంటను వస్తారు. అందువల్ల కొత్త పంట మొదటి నైవేద్యాన్ని అగ్ని దేవుడికి సమర్పిస్తారు. ఈ రోజున రైతులు కొత్త సంవత్సరంలో మంచి పంటలు పండాలని దేవుడిని ప్రార్థిస్తారు. లోహ్రి ద్వారా అగ్ని దేవుడికి సమర్పించిన కొత్త పంట దేవతలందరికీ చేరుతుందని పురాణ గ్రంధాలలో చెప్పబడింది. లోహ్రీలో సూర్య భగవానుడు , అగ్ని దేవ్‌లను పూజిస్తారు, మంచి పంటలు ఇచ్చినందుకు దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతారు. అలాగే పంటలు బాగా పండాలని ప్రార్థిస్తారు.

లోహ్రీ ఎలా జరుపుకుంటారు?

లోహ్రీ పండుగ తెల్లవారు జామున బహిరంగ ప్రదేశంలో కలప, ఆవు పేడతో చేసిన పిడకలను కుప్పను తయారు చేస్తారు. అప్పుడు కట్టెలు ఆవు పేడ పిడకల కుప్పకు నిప్పు పెడతారు. దీని తరువాత, అక్కడ ఉన్న ప్రజలు మండుతున్న అగ్నిని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కొత్త పంటలు, నువ్వులు, బెల్లం, వేరుశెనగ మొదలైన వాటిని అగ్నిలో వేస్తారు. ప్రదక్షిణ తర్వాత ప్రజలు లోహ్రీలో ఒకరినొకరు అభినందించుకుంటారు. మహిళలు జానపద పాటలు పాడతారు. అందరూ డ్రమ్స్ వాయిస్తూ డాన్స్ చేస్తారు. లోహ్రీ పండగ సమయంలో అగ్ని చుట్టూ డ్యాన్స్ చేయడం.. గాలిపటాలు ఎగురవేయడం ఆచారం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.