Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశీ విశ్వేశ్వరుడి సేవలో పవన్ పిల్లలు అకిరా, ఆధ్యా.. సామాన్యుల్లా ఆటోలో ప్రయాణం.. వీడియో వైరల్..

తండ్రి ఓ రేంజ్ లో ఫేమస్ పర్సన్.. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇప్పడు దేశ వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తీ.. ఇంకా చెప్పాలంటే చిత్ర రంగం లో పవర్ స్టార్.. రాజకీయ రంగంలో గేమ్ చేంజర్..ఏపీ డిప్యూటీ సీఎం.. మొత్తానికి భారతదేశంలోనే ఒక గొప్ప పేరు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎంత గొప్పగా ఉండాలి.. అయితే పవన్ పిల్లలు కదా.. తండ్రి బాటలోనే తనయుడు, కూతురు.. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు..

కాశీ విశ్వేశ్వరుడి సేవలో పవన్ పిల్లలు అకిరా, ఆధ్యా.. సామాన్యుల్లా ఆటోలో ప్రయాణం.. వీడియో వైరల్..
Akria Adhya In Kashi
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2024 | 8:14 AM

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కొంతమందికే ఉంటుంది.. అలాంటి వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఏపీ డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ పేరు గుర్తుకొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే కాదు.. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని అభిమానులకు దేవుడిగా మారినా సరే ఎక్కడా మచ్చుకు కూడా గర్వం తలకెక్కని వ్యక్తీ అని స్నేహితులు సన్నిహితులు మాత్రమే కాదు ఇతరులు కూడా చెబుతారు. పవర్ స్టార్ గా టాలీవుడ్ హీరోల్లో స్టార్ హీరోగా ఉన్నప్పుడు మాత్రమే కాదు.. రాజకీయాల్లో అడుగు పెట్టి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తర్వాత కూడా తన జీవన విధానాన్ని సాటి మనుషుల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతలను ఏ మాత్రం మరచి పోనీ వ్యక్తీ. ఒక పెద్ద స్థాయి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పిల్లలు అయి ఉండి కూడా అకిరా, ఆద్యలు సామాన్యులు గా ఆటోలలో తిరుగుతూ.. విశ్వేశ్వరుడు కొలువైన క్షేత్రంలో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అకిరా, ఆద్యలు తల్లి రేణు దేశాయ్ తో కలిసి ప్రాముఖ్య ఆధ్యాత్మిక క్షేత్రం వారాణసికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అకిరా సామాన్య భక్తుడిలా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి చెల్లి ఆద్య తల్లి రేణు దేశాయ్ తో కలిసి కాశీ క్షేత్రంలో ప్రముఖ దేవాలయాలను, గంగమ్మని దర్శించుకున్నాడు. అది కూడా కాశీ రోడ్ల మీద సామాన్యుల్లా ఆటోల్లో ప్రయాణించారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అయితే అక్కడ కొంత మంది ఆద్య, అకిరా నందన్ లను గుర్తు పట్టినట్లు తెలుస్తొంది. వారణాసిలో అకిరా, ఆద్యలకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం నేట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ తండ్రికి తగ్గ పిల్లలాంటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో అకిరా, ఆద్యలను విలాసాలను, ఆడంబరాలకు దూరంగా సామాన్య జీవితం అర్ధమయ్యేలా పెంచుతున్న తల్లి రేణు దేశాయ్ ని కూడా పొగుడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..