Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brown Sugar vs Honey: షుగర్ బదులుగా బ్రౌన్ షుగర్ లేదా తేనె ఏది బెస్ట్ ఎంపిక.. బరువు తగ్గడానికి ఏది ప్రయోజనకరం అంటే..

ప్రస్తుతం కాలంతో పరుగులు పెడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. తినే తిండి, నిద్ర నుంచి అన్ని అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి తినే ఆహారంలో మార్పులు చేసుకుంటారు. చాలా మంది బ్రౌన్ షుగర్, తేనెను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం? ఈ రోజు తెలుసుకుందాం.

Brown Sugar vs Honey: షుగర్ బదులుగా బ్రౌన్ షుగర్ లేదా తేనె ఏది బెస్ట్ ఎంపిక.. బరువు తగ్గడానికి ఏది ప్రయోజనకరం అంటే..
Brown Sugar Vs Honey
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2024 | 11:41 AM

ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం పెద్ద సవాల్‌గా మారింది. ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, సరైన ఆహార ఎంపికను ఎంచుకోవడానికి షుగర్ తీసుకోవడం తగ్గిస్తున్నారు. లేదా దాని స్థానంలో మంచి ఎంపికను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే షుగర్ బదులుగా బ్రౌన్ షుగర్, తేనె వైపు ఎక్కువ మంచి దృష్టి సారిస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి ఈ రెండిటలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది?

సాధారణ చక్కెరను ఉపయోగించడం వలన బరువు పెరగడమే కాదు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని మనందరికీ తెలుసు. అందుకే ప్రజలు షుగర్ ని వదలి బ్రౌన్ షుగర్ లేదా తేనెను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు. బ్రౌన్ షుగర్, తేనె రెండూ సహజమైన ప్రత్యామ్నాయాలు. ఇవి సాధారణ చక్కెరతో పోలిస్తే చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. అయితే ఇవి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి.. బరువు తగ్గే ప్రక్రియలో అవి ఎంత ప్రభావవంతంగా పని చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. బ్రౌన్ షుగర్, తేనెల్లో ఏది ఆరోగ్యానికి ప్రయోజనాలను ఇస్తాయి.. అనారోగ్యాన్ని కలిగిస్తాయో తెలుసుకుందాం.. అలాగే బరువు తగ్గడానికి ఈ రెండిటిలో ఏది బెస్ట్ ఎంపిక తెలుసుకుందాం..

బ్రౌన్ షుగర్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

శుద్ధి చేసిన చక్కెరలో బెల్లం కలపడం ద్వారా బ్రౌన్ షుగర్ తయారవుతుంది. దీనిలో కాల్షియం, పొటాషియం, ఇనుము వంటి ఖనిజ మూలకాలు అధికంగా ఉన్నాయి. తెల్ల చక్కెరతో పోల్చితే ఇది కొంచెం ఎక్కువ పోషకాలను కలిగి ఉంది. సాధారణ చక్కెరతో పోలిస్తే బ్రౌన్ షుగర్ కొంచెం తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇది తక్కువ ఖనిజాలను కలిగి ఉండటం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అదే సమయంలో బ్రౌన్ షుగర్ లో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీని కారణంగా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే బరువు పెరుగుతారు.

తేనె అంటే ఏమిటి?

తేనె అనేది పువ్వుల పుప్పొడి నుంచి తేనెటీగలు తయారుచేసే సహజ స్వీటెనర్. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది సహజమైనది. శరీరంలో త్వరగా జీర్ణమవుతుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అదే సమయంలో తేనె లో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. దీనిని ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే శారీరంలో కేలరీలను పెంచుతుంది. కొన్ని బ్రాండ్లలో ప్రాసెసింగ్ కారణంగా.. పోషకాహార లోపం కూడా ఏర్పడవచ్చు.

రెండిలో బరువు తగ్గడానికి ఏది మంచిది?

బ్రౌన్ షుగర్ తేనెతో పోల్చితే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అయితే బ్రౌన్ షుగర్ లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. కనుక బరువు తగ్గడానికి ఇది అంతగా ఉపయోగపడదు. తేనె సహజమైనది. కొంచెం ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. అయితే ఇది జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక పోషణ గురించి మాట్లాడినట్లయితే.. బ్రౌన్ షుగర్తో పోలిస్తే తేనెలో ఎక్కువ పోషకాహారం. తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

బ్రౌన్ షుగర్‌తో పోలిస్తే బరువు తగ్గడంలో తేనె ఎక్కువ మేలు చేస్తుంది. గోరువెచ్చని నీరు, నిమ్మరసంతో తేనెను తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్ సాధారణ షుగర్ లాగా ఉంటుంది.. కనుక ఇది బరువు తగ్గడంలో అంతగా ఉపయోగపడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)