Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అధికారుల నిర్లక్ష్యం.. వీధులను.. డ్రైనేజ్ ను రోజూ శుభ్రం చేస్తోన్న 83 ఏళ్ల వృద్దుడు..

యధా రాజ తధా ప్రజ అన్నచందంగా ఉంటుంది నేటి పాలకులు.. ప్రజల మధ్య ఉన్న పరిస్తితులు. ఇంటిని మాత్రమే కాదు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు చెబుతూనే ఉంటారు. చెత్త వంటి వ్యర్ధాలను వేసేందుకు తగిన సదుపాయాలు కల్పిస్తారు. అయితే కొంతమంది ప్రజలు మా ఇల్లు కాదు కదా పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడ వేస్తె ఏమిటి అంటూ ఎక్కడ బడితే అక్కడ చెత్త వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అధికారులు కూడా వ్యర్ధాలను క్లీన్ చేయించడంలో కూడా నిర్లక్షం వహిస్తూ ఉంటారు. వీరందరికీ ఓ 80 ఏళ్ల వృద్దుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. హృదయాన్ని కదిలించే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వృద్ధుడు చేస్తున్న పనికి ప్రశంసలు లభిస్తున్నాయి.

Viral Video: అధికారుల నిర్లక్ష్యం.. వీధులను.. డ్రైనేజ్ ను రోజూ శుభ్రం చేస్తోన్న 83 ఏళ్ల వృద్దుడు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2024 | 1:23 PM

ఇప్పటి జనరేషన్ లో మనం చూసుకుంటే మన ఇంటిని చాలు అనే భావం ఎక్కువగా ఉంది. ఇక వయసు పైబడిన వారు కూడా కాటికి కాళ్లు చాచిన మేము ఏమీ చెయ్యగలం అనే ఆలోచించే వారు తరచుగా తారస పడుతూనే ఉంటారు. అయితే వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక వృద్ధుడు నేటి తరం యువకులకు.. వృద్ధులకు కూడా అనుసరణీయం. ఎవరూ పట్టించుకోవడం లేదు.. నేను ఎందుకు పట్టించుకోవాలనే ఆలోచన లేకుండా ఓ వృద్దుడు తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని రోజూ శుభ్రం చేస్తున్నారు. అవును 83 ఏళ్ల వయస్సులో కూడా అతను చాలా ఉత్సాహంగా వీధులను, కాలువలను రోజూ శుభ్రం చేస్తున్నారుడు. దీనికి సంబంధించిన హృదయాన్ని కదిలించే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వృద్ధుడి సామాజిక సృహకు భాద్యతకు ప్రశంసలు లభిస్తున్నాయి.

హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసించే 83 ఏళ్ల సూర్య నారాయణ్ ప్రతిరోజూ సుమారు 2 గంటలు తన ఇంటి చుట్టుపక్కల వీధిని శుభ్రం చేయడానికి వెచ్చిస్తారు. అక్కడ పరిసరాలను శుభ్రం చేసేందుకు బీబీఎంపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సూర్యనారాయణే స్వయంగా తన ఇంటి చుట్టుపక్కల వీధిని ఏళ్ల తరబడి శుభ్రం చేస్తున్నాడు. అవును.. వీధిలో చెత్తను ఊడ్చడం దగ్గర్నుంచి డ్రైన్లలో పడిన చెత్త ఎత్తి డస్ట్ బీన్స్ లో వేయడం వరకు రోజువారీ పనులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 27న షేర్ చేయబడిన ఈ వీడియోను లక్షాలాది మంది చూస్తున్నారు. వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు “ఈ గొప్ప వ్యక్తికి నా వందనం” అని ఒక వ్యాఖ్యను రాశారు. మరొక వినియోగదారు,  అతని పని నిజంగా స్ఫూర్తిదాయకం” అన్నారు. బీబీఎంపీ అధికారులు వీలైనంత త్వరగా మేలుకోండి’ అని మరోకరు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..