Watch: పులులు, తోడేళ్లు కాదు.. జనావాసాల్లోకి క్యూ కడుతున్న హైనాలు.. షాకింగ్‌ వీడియో చూస్తే వణుకే..!

ఒంటరిగా సంచరిస్తున్న హైనాను వారు వీడియో తీశారు. ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Watch: పులులు, తోడేళ్లు కాదు.. జనావాసాల్లోకి క్యూ కడుతున్న హైనాలు.. షాకింగ్‌ వీడియో చూస్తే వణుకే..!
Hyena
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2024 | 12:47 PM

ఇప్పటికే తోడేళ్లు, పులుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలను తాజాగా హైనాలు భయపెడుతున్నాయి. ఓ హైనా జనావాసాల్లోకి వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రూరల్ మలాసా బ్లాక్ ప్రాంతంలో హైనా కనిపించింది. కొందరు గ్రామస్తులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే, గత రెండు రోజుల క్రితం కాన్పూర్‌లోని ఘతంపూర్‌లో రెండు హైనాలు కనిపించాయి. అందులో ఒక హైనా రైలు ఢీకొని మరణించింది. ఇంకొకటి పారిపోయినట్టుగా స్థానికులు వెల్లడించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మరణించిన హైనాను సమీపంలోని భూమిలోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు. పారిపోయిన హైనా కోసం గాలిస్తున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే కాన్పూర్ రూరల్ మలాసా బ్లాక్ ప్రాంతంలో హైనా కనిపించినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఒంటరిగా సంచరిస్తున్న హైనాను వారు వీడియో తీశారు. ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..