AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత వాయుసేన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు..ఏం జరిగిందంటే..!

1968లో మల్ఖాన్‌సింగ్‌ బృందం ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌-12 రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద ప్రమాదానికి గురైంది. మంచుకొండల్లో నాడు గల్లంతైన మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం.. ఇటీవల ఇండియన్‌ ఆర్మీకి దొరికింది. బ్యాడ్జి ఆధారంగా ఆయనను గుర్తించారు. మల్ఖాన్‌సింగ్‌ పార్థివదేహానికి బుధవారం

భారత వాయుసేన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు..ఏం జరిగిందంటే..!
Army Soldier
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2024 | 11:00 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ జిల్లాలో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకొంది. 56 ఏళ్ల క్రితం వీరమరణం పొందిన భారత వాయుసేన సైనికుడు మల్ఖాన్‌సింగ్‌ పార్థివదేహానికి 2024 అక్టోబర్‌ 02న అంత్యక్రియలు జరిగాయి. 1968లో మల్ఖాన్‌సింగ్‌ బృందం ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌-12 రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద ప్రమాదానికి గురైంది. మంచుకొండల్లో నాడు గల్లంతైన మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం.. ఇటీవల ఇండియన్‌ ఆర్మీకి దొరికింది. బ్యాడ్జి ఆధారంగా ఆయనను గుర్తించారు. మల్ఖాన్‌సింగ్‌ పార్థివదేహానికి బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన ఫతేపుర్‌లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

సియాచిన్‌ మంచుదిబ్బల్లో పూడుకుపోయినందున మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం పూర్తిగా ఏమీ పాడవలేదని, కుటుంబసభ్యులు ఆయనను గుర్తించేలా ఉందని సహారన్‌పుర్‌ ఏఎస్పీ సాగర్‌ జైన్‌ తెలిపారు. భారత వాయుసేన సిబ్బంది బుధవారం మధ్యాహ్నం మల్ఖాన్‌సింగ్‌ పార్థివదేహాన్ని గ్రామానికి తీసుకురాగానే కుటుంబసభ్యులతోపాటు గ్రామస్థులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మల్ఖాన్‌సింగ్‌ అమర్‌ రహే అంటూ స్థానికులు నినాదాలు చేశారు. మల్ఖాన్‌సింగ్‌ తమ్ముడు ఇసమ్‌సింగ్‌ కన్నీటిపర్యంతం అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..