Amritsar News: ఏం ధైర్యం రా మహిళకు.. తలుపుకు అడ్డుగా నిలబడి…వీడియో వైరల్

ఓ మనిషి తన ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఎంతటికైనా తెగ్గిస్తారు. ఇక ముఖ్యంగా మహిళలు అయితే చెప్పనకర్లేదు.. తమ పిల్లలకు కాపాడుకోవడానికి శక్తిని మించి పోరాడుతారు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది.

Amritsar News: ఏం ధైర్యం రా మహిళకు.. తలుపుకు అడ్డుగా నిలబడి...వీడియో వైరల్
Amritsar News
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 03, 2024 | 10:48 AM

ఓ మనిషి తన ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఎంతటికైనా తెగిస్తారు. ఇక ముఖ్యంగా మహిళలు అయితే చెప్పనకర్లేదు.. తమ పిల్లలకు కాపాడుకోవడానికి శక్తిని మించి పోరాడుతారు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. పట్టపగలే కొందరు దొంగలు గోడ దూకి ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతుంటే ఓ మహిళ డోర్‌కు అడ్డంగా నిలబడి దొంగలను లోపలకి రాకుండా విశ్వప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ముగ్గురు దొంగలు గోడ దూకి లోపలికి చోరబడే ప్రయత్నం చేశారు. దొంగలు వచ్చారని ముందే పసిగట్టిన మహిళ అలెర్ట్ అయింది. దొంగలు లోపలికి రాకుండా డోర్‌కు అడ్డుగా నిలబడింది. ముగ్గురు దొంగలు తలుపును ఎంత తెరుదామని చూసిన మహిళ బలంగా తలుపుకు అడ్డంగా నిలబడింది. ఎలాగోలా డోర్‌కు గడియపెట్టి.. ఒక్క చేతితో తలుపును పట్టుకొని, మరో చేతితో సోఫాను లాగి అడ్డుగా పెట్టింది. మహిళ ఇలా ఒంటరిగా పోరాడానికి ముఖ్యంగా కారణం.. ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం అని తెలుస్తుంది. వారికి హాని కలగవద్దని మహిళ ఇలా చేసినట్లు తెలుస్తుంది. ఏదైతేనెం మహిళ తనను కాపాడుకొని తన పిల్లలను కాపాడుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో ట్రెండింగ్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. శెభాష్ ..తన ప్రాణాలకు తెగ్గించి పోరాడిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ముగ్గురు దొంగలకు మహిళ చుక్కలు చూపించలేదుగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ముగ్గురు దొంగలకు చుక్కలు చూపించిన మహిళ.. వీడియో: