సర్కస్‌లో ఊహించిన సీన్..! ఎలుగుబంటి దాడితో పరుగులు పెట్టిన ప్రేక్షకులు..చివరకు ఏం జరిగిందంటే..
అయితే, సర్కస్‌లో జంతువులు అప్పుడప్పుడు కోపంతో రెచ్చిపోయి దాడులు చేస్తున్న సంఘటనలు కూడా పలు సందర్భాల్లో చూస్తుంటాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సర్కస్‌లో విన్యాసాలు చేస్తుండగా ఒక ఎలుగుబంటి ఆగ్రహానికి గురై దాడి చేసింది. దాంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహాకారాలు అలుముకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోను 50 లక్షల మందికి పైగా వీక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా అడవి జంతువులను చాలా మంది పెంచుతుంటారు. కొన్ని రకాల అడవి జంతువులను సర్కస్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. అంతేకాదు.. సర్కస్‌లో చాలా రకాల జంతువులను ఉపయోగిస్తారు. సర్కస్‌లో వాటి విన్యాసాలు చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే, సర్కస్‌లో జంతువులు అప్పుడప్పుడు కోపంతో రెచ్చిపోయి దాడులు చేస్తున్న సంఘటనలు కూడా పలు సందర్భాల్లో చూస్తుంటాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సర్కస్‌లో విన్యాసాలు చేస్తుండగా ఒక ఎలుగుబంటి ఆగ్రహానికి గురై దాడి చేసింది. దాంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహాకారాలు అలుముకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోను 50 లక్షల మందికి పైగా వీక్షించారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను 50 లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలో, హ్యాండ్లర్ సూచనలను పాటిస్తూ ఎలుగుబంటి తన విన్యాసాలు చూపుతోంది. ఒక్కసారిగా కోపంతో చిర్రెత్తిపోయిన ఎలుగుబంటి హ్యాండ్లర్‌పై దాడి చేసింది. ఈ దాడిలో హ్యాండ్లర్ గాయపడ్డాడు. కానీ వెంటనే అతను ఎలుగుబంటి దాడి నుండి బయటపడ్డాడు. తృటిలో అతను తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు.
ఈ వీడియో చూడండి..
— NATURE IS BRUTAL (@TheBrutalNature) October 2, 2024
ఉన్నట్టుండి ఎలుగుబంటి దాడి చేయటంతో.. సర్కస్ చూడటానికి వచ్చిన ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రజలంతా అరుపులు, కేకలు పెడుతూ అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. అయితే, ఈ వీడియో రష్యాకు చెందినదిగా తెలిసింది. ఈ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని, వెంటనే ఎలుగుబంటిని నియంత్రించారని తెలిసింది. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని నిర్వాహకులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..