ఆ వెబ్ సిరీస్ దొంగచాటుగా చూశారు.. పట్టుకోలేరని భ్రమపడ్డారు.. కానీ కిమ్ ఎవరూ ఊహించని శిక్ష విధించాడు..
నార్త్ కొరియా డిక్టేటరైన కిమ్ జోంగ్ ఉన్ క్రూరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరుకు...
నార్త్ కొరియా డిక్టేటరైన కిమ్ జోంగ్ ఉన్ క్రూరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరుకు ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్ ఉంది. అప్పుడెప్పుడో నిర్దాక్షిణ్యంగా మనుషులను కిరాతకంగా చంపిన అడాల్ఫ్ హిట్లర్‌ను మరోసారి గుర్తు చేస్తూ ఈ ఆధునిక నియంత వేసే శిక్షలు అన్నీ ఇన్నీ కావు. అన్వాయుధాల సృష్టికర్తగా పేరుగాంచిన కిమ్ జోంగ్ ఉన్ తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడు. అలాంటి దాయాది దేశం విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఊరుకుంటాడా.? సౌత్ కొరియా విషయంలో చిన్న పొరపాటు చేసిన ఓ వ్యక్తికి కిమ్ అత్యంత కిరాతకమైన శిక్షను విధించాడు. కిమ్ చేసిన ఈ దుశ్చర్యకు మరోసారి ప్రపంచమంతా షాక్ అయింది.
దక్షిణ కొరియాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ను ఓ వ్యక్తి దొంగచాటుగా చైనా సర్వర్ల నుంచి డౌన్‌లోడ్ చేసి చూశాడని కిమ్ జోంగ్ ఉన్ అతడ్ని సైన్యంతో అతి కిరాతకంగా కాల్చి చంపించాడు. అంతేకాకుండా సదరు వ్యక్తి నుంచి ఫ్లాష్ పెన్ డ్రైవ్స్ ద్వారా ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌ను ఏడుగురు విద్యార్ధులు చూడగా.. వారిలో ఒకరికి జీవిత ఖైదు, మరో ఆరుగురికి ఐదేళ్ల నిర్భంద శిక్షను కిమ్ విధించాడు.
అటు ఆ విద్యార్ధులు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లను విధుల నుంచి తొలగించి.. వారికి కూడా ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించింది కిమ్ ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా తమ శిక్షాకాలం ముగిసేవరకు బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో కూలీ పనులు చేయనున్నారు. కాగా, ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ అనేది ఎంటర్టైన్మెంట్ బేస్‌డ్ షో కాదని.. దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ఈ వెబ్ సిరీస్ ప్రతిబింబిస్తోందని.. అది నార్త్ కొరియా సంప్రదాయానికి విరుద్దమని.. అందుకే ఈ వ్యవహారాన్ని ఆదిలోనే అంతం చేస్తున్నామని’ కిమ్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది.
కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!
ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?