Watch: గాఢ నిద్రలో ఉన్న యువకుడి గదిలో దూరిన ఎలుగుబంటి.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే..

గదిలో ఉన్న ఎలుగుబంటిని చూసిన ఆ యువకుడు నిద్రలోంచి ఒక్కసారిగా భయపడి లేచాడు. వెంటనే అక్కడున్న తన మొబైల్‌ ఫోన్‌ తీసుకుని క్షణంలో అక్కడ్నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ ఎలుగుబంటి కూడా అతనిని వెంబడిస్తుంది.. వీడియో చివరలో ఎలుగుబంటి బయటకు రావడం కూడా కనిపించింది.

Watch: గాఢ నిద్రలో ఉన్న యువకుడి గదిలో దూరిన ఎలుగుబంటి.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే..
Man sleeping peacefully in room bear entered
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 27, 2024 | 12:35 PM

మనం ఇంట్లో మనం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఉంటాం. ఇక రాత్రిళ్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దుప్పటి కప్పేసుకుని హాయిగా నిద్రపోతాం. కానీ, గాఢ నిద్రలో ఉండగా, అర్ధరాత్రి అనుకోని పిలవని అతిథి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది..? మరి ఆ అతిథి భయంకరంగా ఉంటే భయంకర జంతువై ఉంటే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం కూడా. వైరల్‌ వీడియోలో సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. హాయిగా నిద్రిస్తున్న ఓ యువకుడి గదిలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

@Yoda4ever అనే వినియోగదారు ఈ వీడియోని X లో షేర్‌ చేసారు. వీడియోలో ఒక ఎలుగుబంటి ఇంట్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది. తలుపులు తెరిచి ఎలుగుబంటి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎలుగుబంటి బయటి నుంచి వస్తూ తలుపులు తెరిచి లోపలికి ఏ మాత్రం సంకోచం లేకుండా వస్తూ ఉంటుంది. ఆ రూమ్‌లోకి వచ్చిన ఎలుగు బంటి ఏదో వెతుకుతున్నట్లుగా చుట్టూ చూస్తోంది. అదే సమయంలో అక్కడే ఒక వ్యక్తి బెడ్‌షీట్ కప్పుకుని నిద్రిస్తున్నాడు.. తనకు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. లోపలికి ప్రవేశించి, ఎలుగుబంటి గది మొత్తం చూస్తోంది. ఎలుగుబంటి టేబుల్ కింద, గది చుట్టూ తిరుగుతూ ఏదో వెతకటం కనిపించింది. నిద్రలో నుంచి ఒక్కసారిగా మెలకువ రావడంతో అతనికి మొదట ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆ యువకుడు కళ్ళు తెరిచి చూసి కంగుతిన్నాడు. ఆ వెంటనే తన అప్రమత్తమైన అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

ఇవి కూడా చదవండి

గదిలో ఉన్న ఎలుగుబంటిని చూసిన ఆ యువకుడు నిద్రలోంచి ఒక్కసారిగా భయపడి లేచాడు. వెంటనే అక్కడున్న తన మొబైల్‌ ఫోన్‌ తీసుకుని క్షణంలో అక్కడ్నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ ఎలుగుబంటి కూడా అతనిని వెంబడిస్తుంది.. వీడియో చివరలో ఎలుగుబంటి బయటకు రావడం కూడా కనిపించింది.

అయితే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది స్పందించారు. అలా నిద్రలోంచి లేచి, సమీపంలో ఎలుగుబంటిని చూడటం కల లేదా వాస్తవమా అనేది కూడా అర్థం చేసుకోలేమని ఒక వ్యక్తి వ్యాఖ్యనించారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఎలుగుబంట్ల ఇతర వీడియోలను కూడా షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..