AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదేమైనా కుక్కపిల్లా తల్లి..! మొసలిని బుజ్జగించి బువ్వ పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే.!

చుట్టూ దట్టమైన చెట్లతో కూడి ఉన్న ఒక చెరువులో ఈదుకుంటూ ఆడుకుంటున్నారు గాబీ, బెల్లా ఇద్దరు. యజమాని గాబీ బెల్లాకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. నోటిలో ఆహారం పెట్టాక మొసలిని వెంబడించి కౌగిలించుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను

అదేమైనా కుక్కపిల్లా తల్లి..! మొసలిని బుజ్జగించి బువ్వ పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే.!
Woman And Alligator
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2024 | 12:00 PM

Share

అడవి జంతువులలో మొసలి అత్యంత ప్రమాదకరమైన జీవి. ఏటా మొసళ్ల దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మొసళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటితో ఆటలు ఆడటం అటుంచి, కనీసం దగ్గరగా వెళ్లాలని చూసినా ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలో ఒక మహిళ రిజర్వాయర్‌లో మొసలితో కలిసి ఈత కొడుతూ దానికి ఆహారం ఇస్తూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వెంటనే సదరు మహిళ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి చర్యలను ప్రోత్సహించరాదని కూడా కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో బెలోవింగ్ ఎకర్ ఎలిగేటర్ అభయారణ్యం యజమాని గాబీ కనిపించారు. వీడియోతో ఇచ్చిన క్యాప్షన్ ప్రకారం, రిజర్వాయర్‌లో గాబీతో ఉన్న ఆడ మొసలి పేరు బెల్లా. బెల్లా చాలా కోపంగా ఉందని, తనకు ఆహారం పెడుతున్నప్పుడు దానిని శాంతింపజేయడానికి కొన్ని ట్రిక్స్‌ ప్లేచేయాల్సి ఉంటుందని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Gabby 🐾 (@gabbynikolle)

చుట్టూ దట్టమైన చెట్లతో కూడి ఉన్న ఒక చెరువులో ఈదుకుంటూ ఆడుకుంటున్నారు గాబీ, బెల్లా ఇద్దరు. యజమాని గాబీ బెల్లాకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. నోటిలో ఆహారం పెట్టాక మొసలిని వెంబడించి కౌగిలించుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా చూశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..