Watch: రేయ్ ఎవర్రా మీరంతా..? బుల్లి కారును గూడ్స్ రైలుగా మార్చేశారుగా.. వదిలేస్తే ఇంకేచేస్తారో..
ఇక ఆ కారు పై కప్పు మీద పెద్ద మొత్తంలో పొడవాటి కర్రలు, ఏవో పెద్ద పెద్ద బస్తాల్లో కట్టిన మూటలు ఉన్నాయి. ఇక వాటిపై కొందరు మనుషులు కూడా ఎక్కి కూర్చోని ఉన్నారు. ఇక కారు కదలడానికి పూర్తి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదని చెప్పవచ్చు అంటున్నారు నెటిజన్లు.
ఒక్కోసారి టూ వీలర్‌పై ఐదు నుంచి ఆరు మంది వరకు ప్రయాణించడం చూస్తుంటాం. అలాగే, ఐదు సీట్ల కారులో 10 మంది వరకు కలిసి వెళ్లడం కూడా అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ, ఇక్కడ జరిగింది మాత్రం నమ్మడం కొంచెం కష్టమేనండోయ్.. ఎందుకంటే.. ఒక వ్యక్తి తన ఆల్టో కారును గూడ్స్ రైలుగా మార్చేశాడు. కారు పై కప్పు మీద వేసిన లోడ్ చూస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అంత బరువులు మోస్తూ ఆ కారు ఎలా ముందుకు సాగుతుందో చెప్పడం కూడా కష్టమే. ఇకపోతే, ఇదంతా చూసుకునేందుకు ముగ్గురు వ్యక్తులను కూడా అక్కడ నియమించారు. అసలు విషయంలోకి వెళితే..
ఆగండి.. ఆగండి…ఈ కారు కథ అప్పుడే అయిపోయలేదు..ఆ బుజ్జి కారులో ఒక ఒంటె కూడా కూర్చొని ఉంది. ఆ ఒంటె మెడను కిటికీలోంచి బయటకు పెట్టి ఉంది. ఇక ఆ కారు పై కప్పు మీద పెద్ద మొత్తంలో పొడవాటి కర్రలు, ఏవో పెద్ద పెద్ద బస్తాల్లో కట్టిన మూటలు ఉన్నాయి. ఇక వాటిపై కొందరు మనుషులు కూడా ఎక్కి కూర్చోని ఉన్నారు. ఇక కారు కదలడానికి పూర్తి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదని చెప్పవచ్చు అంటున్నారు నెటిజన్లు.
ఈ వీడియో చూడండి..
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియో @rajlove7594 Instagramలో షేర్ చేయబడింది. కాగా, ఈ పాత మోడల్ ఆల్టో కారు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ క్లిప్ ఎక్కడ తీశారో తెలియదు కానీ పాకిస్థానీయులు మాత్రమే ఈ ఫీట్ చేసి ఉంటారని చాలా మంది నెటిజన్లు పేర్కొన్నారు. ఒక నెటిజన్ ఫన్నీగా వ్యాఖ్యనిస్తూ.. ఈ వ్యక్తి మొదట ఒంటెను కూర్చోబెట్టి, ఆపై కారును తయారు చేసి ఉండాలి అంటున్నారు. మరికొందరు స్పందిస్తూ.. ఇది కారు కాదు గురూ.. గూడ్స్ రైలు అనుకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..