AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maggi Mirchi: ట్విట్టర్‌లో మంటలు రేపుతున్న మ్యాగీ మిర్చీ బజ్జీ.. రెసిపి చూసి నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే..

మ్యాగీ తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికీ మ్యాగీ అంటే అదో రకం పిచ్చి. మాగీ తయారు చేయడం కూడా చాలా సులభం..

Maggi Mirchi: ట్విట్టర్‌లో మంటలు రేపుతున్న మ్యాగీ మిర్చీ బజ్జీ.. రెసిపి చూసి నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే..
Maggi Mirchi Picture Goes V
Sanjay Kasula
|

Updated on: Oct 01, 2021 | 11:03 AM

Share

మ్యాగీ తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికీ మ్యాగీ అంటే అదో రకం పిచ్చి. మాగీ తయారు చేయడం కూడా చాలా సులభం.. అలాగే తింటున్నప్పుడు కూడా ఆ రుచి వేరుగా ఉంటుంది.  మనకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఈజీగా.. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. త్వరగా ఏదైన తినాలి అనిపిస్తే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కూడా మ్యాగీ. గత రెండు రోజులుగా ఓ మిర్చీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజనం తెగ లైకులు, షేర్లు చేస్తున్నారు. అంతే కాదు ఈ మ్యాగీ మిర్చీ రెసిపీ వేగంగా షేర్ అవుతోంది. ఇది చూసిన సోషల్ మీడియా యూజర్లు తెగ ఆశ్చర్య పోతున్నారు.

ఈ రెసిపిపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. నూడుల్స్  కొత్త వెర్షన్ ప్రతి ఒక్కరికీ బాగా నచ్చింది. అంతేకాదు కామెంట్స్‌ కూడా జోడిస్తున్నారు. వైరల్ అవుతున్న చిత్రంలో పచ్చడి మిరపకాయను తయారు చేసే పద్దతిని కూడా మీరు చూడవచ్చు. ఈ మిరపకాయ బజ్జీ మధ్యలో మ్యాగీ నూడుల్స్ చూసి షాక్ అవుతున్నారు. ఈ కొత్త మ్యాగీ డిష్‌కు స్టఫ్డ్ మ్యాగీ చిల్లీ అని పేరు కూడా పెట్టారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన చూద్దాం..

సోషల్ మీడియాలో ఈ స్టఫ్డ్ మ్యాగీ చిల్లీ చిత్రాన్ని చాలా ఇష్టపడుతున్నారు. అంతేకాదు మ్యాగీ కాంబోలను ఇష్టపడనవారు తెగ ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ట్విట్టర్ మండిపోతోంది అంటూ ట్వీట్ చేస్తే.. కాదు.. కాదు చాలా రుచిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.