Shocking Video: వామ్మో.. చిన్నారి ఒడిలో గురకపెడుతున్న భారీ ఫైతాన్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. వైరల్
Snake sleeps in lap of Girl: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫన్నీ వీడియోలు అందరినీ నవ్విస్తుంటే.. మరికొన్ని వీడియోలు
Snake sleeps in lap of Girl: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫన్నీ వీడియోలు అందరినీ నవ్విస్తుంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వీటిల్లో మరికొన్ని వణుకు పుట్టిస్తుంటాయి. తాజాగా ఓ బాలిక ఒడిలో పాము నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాము అమ్మాయి ఒడిలో తల పెట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. భారీ కొండచిలువ 20 అడుగులకుపైగా పొడవు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే.. పాము నిద్రపోతున్న క్రమంలో ఆ అమ్మాయి హాయిగా ఒక చేతిలో మొబైల్‌ని పట్టుకుని.. మరో చేతితో కొండచిలువ శరీరంపై నెమురుతూ కనిపిస్తుంది. అయితే.. పాము కూడా ఆ అమ్మాయి ఒడిలో హాయిగా నిద్రపోతూ కనిపిస్తుంది. అయితే.. ఆ అమ్మాయి ఇంటి పెరట్లో కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే.. మనం పాము కదలికలను కూడా చూడవచ్చు. అయితే.. దీనిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత పెద్ద ఫైతాన్ చిన్నారి ఒడిలో నిద్రపోవడం ఏంటీ.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమేనా.. లేక క్రియేట్ చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదీఏమైనా ఈ వీడియో మాత్రం చూపరుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.. వీడియో..
View this post on Instagram
కాగా.. వైరల్ అయిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో యువర్ నేచర్‌గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో సెప్టెంబర్ 18 న షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ ప్రమాదకరమైన వీడియోను1.2 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. వేలాది మంది ప్రజలు పలు కామెంట్లు సైతం చేశారు. అయితే.. వీడియో ఇండోనేషియాకు చెందినదని పేర్కొంటున్నప్పటకీ.. కచ్చితంగా నిర్ధారించడం లేదు.
Also Read: