టూరిస్ట్‌లకు చుక్కలు చూపించిన పాము.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..

Viral Video: మాములుగా పామును దూరంగా చూస్తేనే భయంతో వణికిపోతాం.. అలాంటిది దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి..

టూరిస్ట్‌లకు చుక్కలు చూపించిన పాము.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..


Viral Video: మాములుగా పామును దూరంగా చూస్తేనే భయంతో వణికిపోతాం.. అలాంటిది దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి.. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు కొదవే ఉండదు. నిత్యం రకరకాల పాముల వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇప్పుడు అలంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోట్‌లో సరదాగా రైడ్ కు వెళ్లిన కొందరికి ఊహించని షాక్ తగిలింది. నదిలో రైడ్ చేస్తుండగా దూరంగా ఒక పెద్ద పాము నీటిలో కనిపించింది. చాలా కాలం తర్వాత ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్, వాటర్ గేమ్‌లు ప్రారంభమయ్యాయి. దాంతో పర్యాటకులంతా రివర్ రాఫ్టింగ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో రిషికేష్ సమీపంలోని గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ చేయడానికి వెళ్లారు.

రివర్ రాఫ్టింగ్ చేస్తుండగా ఓ భారీ పాము నీటిలో తేలుతూ కనిపించింది. దాంతో వారు భయంతో కేకలు వేశారు. 10 అడుగుల పొడవైన ఓ పాము నీటిలో కనిపించడంతో అంత షాక్ అయ్యారు. చూస్తుండగానే ఆ పాము తమ వైపు వచ్చేసింది. దాంతో అక్కడి వారు మరింత భయాందోళనకు గురయ్యారు. అంత పొడవైన పాము సడన్ గా తమ వైపు రావడంతో వయారంతా భయంతో కేకలు వేశారు. వారి కేకలకు భయపడిన పాము వారికిదూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: ఈ యువకుడి ధైర్యానికి ఖచ్చితంగా సలాం కొట్టాల్సిందే.. మొసలికే చుక్కలు చూపించాడుగా.!

భారత హాకీ ప్లేయర్‌కు కొత్త తలనొప్పి.. నేను ఆయనను కాదు.. నన్ను ట్రోల్ చేయవద్దంటూ వేడుకోలు

 

Click on your DTH Provider to Add TV9 Telugu