భారత హాకీ ప్లేయర్‌కు కొత్త తలనొప్పి.. నేను ఆయనను కాదు.. నన్ను ట్రోల్ చేయవద్దంటూ వేడుకోలు

పేర్లు ఒకేలా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవి ఎంతలా అంటే సదరు వ్యక్తులే రంగంలోకి దిగి అది నేను కాదంటూ చెప్పుకునే వరకు..

భారత హాకీ ప్లేయర్‌కు కొత్త తలనొప్పి.. నేను ఆయనను కాదు.. నన్ను ట్రోల్ చేయవద్దంటూ వేడుకోలు
Amrinder Singh, Goalkeeper Of Indian Football Team
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2021 | 3:35 PM

Amrinder Singh: పేర్లు ఒకేలా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవి ఎంతలా అంటే సదరు వ్యక్తులే రంగంలోకి దిగి అది నేను కాదంటూ చెప్పుకునే వరకు వస్తుంటాయి. తాజాగా ట్వట్టర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. పంజాబ్ మాజీ సీఎం అమ్రీందర్ సింగ్ దెబ్బకు భారత ఫుట్‌బాల్ ప్లేయర్ తెగ ఇబ్బందులు పడుతున్నాడు. తనకు సంబంధం లేకుండా పంజాబ్ రాజకీయాల్లో మార్మోగిపోతున్నాడు. ఎందుకని అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళ్దాం..

పంజాబ్ మాజీ సీఎం పేరు భారత ఫుట్‌బాల్ గోల్ కీపర్ పేరు ఒకటే కావడంతో అసలు చిక్కు వచ్చింది. ప్రస్తుతం పంజాబ్‌లో రాజకీయంగా ఎంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ ఛీప్ నవజ్యోతి సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడంతో.. పంజాబ్ మాజీ సీఎం అమ్రీందర్ సింగ్ తెరపైకి వచ్చాడు. కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన.. తాజా పరిణామాలతో ఢిల్లీలో నేడు కేంద్ర హోంమినిస్టర్ అమిత్‌షా ను కలిశాడు. దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఆయన్ను ట్విట్టర్లో పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమింది మాత్రం ఆయన అకౌంట్‌ను కాకుండా భారత ఫుట్‌బాల్ టీం గోల్ కోపర్‌ అయిన అమ్రీందర్ సింగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన ఫుట్‌బాలర్ ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని చూపించారు. ముఖ్యంగా మీడియా మిత్రులే ఇలా చేయడంతో ఆయన వేడుకున్నారు.

సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లపై మాజీ ముఖ్యమంత్రికి బదులుగా ఆ‍యన్ను ట్యాగ్ చేయడం ఆపివేయాలంటూ ఫుట్‌బాల్ ఆటగాడు మీడియా సోదరులను కోరారు. “ప్రియమైన మీడియా, జర్నలిస్టులకు విన్నపం. నేను భారత ఫుట్‌బాల్ టీమ్ గోల్‌కీపర్ అమ్రీందర్‌ సింగ్‌ను. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కాదు. దయచేసి నన్ను ట్యాగ్ చేయడం ఆపండి” అంటూ సోషల్ మీడియా వేదికగా విన్నవించారు.

అనంతరం ఈ ట్వీట్ చాలా వైరల్ అయింది. దీంతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడికి ట్విట్‌కు స్పందించారు. “నా యువ స్నేహితుడా, నీకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. నీ భ్యవిషత్ పోటీలలో గెలవాలని కోరుకుంటున్నాను” అని మాజీ సీఎం రిప్లే ఇచ్చారు. సెప్టెంబర్ 18 న కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Also Read: Viral Video: జానపద గీతాలు, జనంతో కలిసి చిందులు.. సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కేంద్ర మంత్రి

Amarinder Singh-BJP: బీజేపీలోకి మాజీ సీఎం.. రంగం సిద్ధం చేసుకుంటున్న కెప్టెన్..