AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జానపద గీతాలు, జనంతో కలిసి చిందులు.. సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కేంద్ర మంత్రి

Law Minister Kiren Rijiju Dance: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదాయ నృత్యంతో అదరగొట్టారు. కజలాంగ్ గ్రామానికి వచ్చిన ఆయన.. అక్కడి సజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి ఆడిపాడారు.

Viral Video: జానపద గీతాలు, జనంతో కలిసి చిందులు.. సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కేంద్ర మంత్రి
Law Minister Kiren Rijiju Dance
Balaraju Goud
|

Updated on: Sep 30, 2021 | 3:44 PM

Share

Union Law Minister Kiren Rijiju Dance: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదాయ నృత్యంతో అదరగొట్టారు. తన సొంత రాష్ట్రం అరుణాచల్‌లో బుధవారం పర్యటించిన సందర్భంగా వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కిరణ్ రిజిజు కజలాంగ్ గ్రామానికి వచ్చారు. అక్కడి సజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి ఆడిపాడారు. స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపిస్తుంటే.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఉత్సాహంగా కాలు కదుపుతూ చిందులు వేశారు. కళాకారుల నృత్యరూపానికి వంత పాడుతూ వారిలో మరింతి జోష్ పెంచారు.

ఈశాన్య రాష్ట్రంలోని కజలాంగ్ గ్రామానికి చెందిన మిజి అని పిలువబడే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాట నృత్యంతో మంత్రిని ఘనంగా స్వాగతించారు. మంత్రి రిజిజు, ప్యాంటు, షర్ట్‌తో పాటు స్నీకర్‌లు ధరించి, గ్రామస్తులతో కాలు కదిలించి ఉల్లాసంగా పాల్గొన్నారు. స్థానిక కళాకారుల తాళాలు, డప్పుల దరుపుల మధ్య, కొద్దిమంది జనం ఉల్లాసంగా చప్పట్లు కొట్టడంతో మంత్రి సంప్రదాయ జానపద పాటలకు నృత్యం చేశారు. ఈ మేరకు ఆయన తన పర్యటనకు సంబంధించి వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి నేను అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లాను. అతిథులు వారి గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల సాంప్రదాయ ఆనందం ఇది. అసలైన జానపద పాటలు, నృత్యాలు అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి సామాజిక వర్గానికి గుబాళింపును అందిస్తాయని వివరించారు.

అరుణాచల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న రిజిజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ సంబంధిత వీడియోల నుండి అతని నైపుణ్యాలను చాటుకునే వరకు, రిజిజు తన అనుచరులతో ఇవన్నీ పంచుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం, అతను తన అనుకూలీకరించిన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయడంపై “యువ తెలివైన అరుణాచల్ సివిల్ సర్వీస్ అధికారులను సంతోషపెట్టడానికి” ప్రముఖ సింగర్ కిశోర్ కుమార్ పాటను పాడారు.

“మా లా మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా మంచి డ్యాన్సర్! అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయం, అద్భుతమైన సంస్కృతిని చూడటం ఆనందంగా ఉంది” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రశంసించారు. కేవలం ప్రధాని మోడీ మాత్రమే కాదు, ట్విట్టర్ మొత్తం కేంద్రమంత్రి నృత్యంతో ఆకట్టుకుంది. “భారతదేశానికి చెందిన ఒక న్యాయ మంత్రి సంప్రదాయాన్ని కాపాడుకోవడం, తన హోదాను మరిచి సామాన్యుడిలా మారిపోవడం అందరిని కట్టిపడేసింది.

Read Also…  NASA and ISRO: అంతరిక్ష డేటాను పంచుకోవడం కోసం ఇస్రో-నాసాల మధ్య ప్రత్యేక ఒప్పందం.. భారత్‌కు మరింత బలం!