వెరైటీ వినాయకుడు.. డిఫరెంట్‌గా కాయిన్స్‌తో బొజ్జ గణపయ్య.. చూసేందుకు క్యూకడుతున్న ప్రజలు

ఇందుకోసం ఒక్కరూపాయి, 10 రూపాయాల నాణేలతో వినాయక ప్రతిమను రూపొందించారు. అయితే మొత్తం 30వేల రూపాయలు వెచ్చించి, 10 రోజులపాటు శ్రమించి ప్రతిమను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. రూపాయి నాణాలతో వినూత్నంగా రూపొందించిన వినాయకుడిని చూసేందుకు పట్టణవాసులు ఎగబడుతున్నారు.

వెరైటీ వినాయకుడు.. డిఫరెంట్‌గా కాయిన్స్‌తో బొజ్జ గణపయ్య.. చూసేందుకు క్యూకడుతున్న ప్రజలు
Ganesh Idol With Currency Coins
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 08, 2024 | 4:52 PM

వినాయక చవితి వచ్చింది అంటే ముందుగా గుర్తొచ్చేది.. బొజ్జ గణపయ్య బుజ్జి బుజ్జి బొమ్మలే. ఏ ఊరు చూసినా ఆ గణనాయకుడి విగ్రహాలే. వీధివీధినా వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు. అందుకే వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న వెరైటీ వెరైటీ ఆలోచనలన్నీ బయట పడుతుంటాయి. ట్రెండ్‌కి తగ్గట్టు కూడా వినాయకుడిని మలుస్తుంటారు.

యాదాద్రి జిల్లా భువనగిరిలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై వేల రూపాయల విలువ చేసే ఒక. రూపాయి ,పది రూపాయల కాయిన్లతో వినాయకుడిని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.. ప్రతి సంవత్సరం డిఫరెంట్‌గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు. అయితే ఈసారి ఇంకాస్త విన్నుత్నంగా ముందుకెళ్లి ఏకంగా వేలాది రూపాయల కాయిన్స్ తో వినాయక ప్రతిమను తయారు చేశారు.

ఇందుకోసం ఒక్కరూపాయి, 10 రూపాయాల నాణేలతో వినాయక ప్రతిమను రూపొందించారు. అయితే మొత్తం 30వేల రూపాయలు వెచ్చించి, 10 రోజులపాటు శ్రమించి ప్రతిమను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. రూపాయి నాణాలతో వినూత్నంగా రూపొందించిన వినాయకుడిని చూసేందుకు పట్టణవాసులు ఎగబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..