కోట్ల విలువైన గుప్తనిధి..! పనికిరాని రాయి అనుకుని తలుపుకు అడ్డుగా పెట్టింది.. ఏం జరిగిందంటే..

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం మహిళ ఇంట్లో దొంగలు పడ్డారని, తన ఇల్లంత లూటీ చేశారని చెప్పింది. అప్పుడు ఈ రత్నం దొంగల కంటపడలేదని, అదే తన అదృష్టంగా చెప్పింది. ఇప్పుడు నా దగ్గర ఇంత విలువైన నిధి ఉందని తెలిసి చాలా సంతోషంగా ఉందని ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసింది.

కోట్ల విలువైన గుప్తనిధి..! పనికిరాని రాయి అనుకుని తలుపుకు అడ్డుగా పెట్టింది.. ఏం జరిగిందంటే..
Prestigious Stone
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2024 | 3:04 PM

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు..! కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఉన్నపళంగా మన జీవితం మారిపోతుంది..! అలాగే, కొందరికీ అదృష్టం వెంటే ఉంటుంది. కానీ, వారు ఆ విషయాన్ని గుర్తించలేరు. వారు దానిని గుర్తించినప్పుడు ప్రపంచం వారిని వేరే లెవల్‌కి తీసుకెళ్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ దశాబ్దాలుగా గుప్త నిధిని వినియోగిస్తోంది. అయితే అందులోని నిజం తెలియగానే ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన రొమేనియాకు సంబంధించినదిగా తెలిసింది. రొమేనియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే వృద్ధ మహిళ అంబర్ నగెట్‌ను డోర్‌స్టాపర్‌గా ఉపయోగించింది. కొన్నాళ్లుగా ఆమె అదో మామూలు రాయిగా భావించింది. కానీ, ఇప్పుడు అది తొమ్మిది కోట్ల విలువైన సంపద అని తెలియటంతో ఒక్కసారిగా ఆమెకు షాక్‌ తిన్నంత పనైంది. బుజౌ ప్రావిన్షియల్ మ్యూజియం డైరెక్టర్ డేనియల్ కోస్టాచే నగ్గెట్ నిజమైన విలువ గురించి ఆ మహిళకు చెప్పారు. ఆ తర్వాత ధ్రువీకరణ కోసం పోలాండ్‌లోని క్రాకోవ్‌కు పంపించారు. ఈ నిధి 3.85 నుంచి 7 కోట్ల ఏళ్ల నాటిదని నిపుణులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వృద్ధురాలు మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఒక వ్యక్తి ఈ రాయిని ఇచ్చినట్టుగా చెప్పింది. అయితే, ఇచ్చిన మహిళ 1991లో చనిపోయిందని చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం మహిళ ఇంట్లో దొంగలు పడ్డారని, తన ఇల్లంత లూటీ చేశారని చెప్పింది. అప్పుడు ఈ రత్నం దొంగల కంటపడలేదని, అదే తన అదృష్టంగా చెప్పింది. ఇప్పుడు నా దగ్గర ఇంత విలువైన నిధి ఉందని తెలిసి చాలా సంతోషంగా ఉందని ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసింది.

రొమేనియాలో కొన్ని ధనిక అంబర్ నిక్షేపాలు ఉన్నాయి. వీటిని వాడుకలో నది రత్నాలు అని పిలుస్తారు. భూగర్భ శాస్త్రవేత్త ఆస్కార్ హెల్మ్ ఈ నిక్షేపాలకు రుమానిట్ లేదా బుజౌ అంబర్ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో పాత స్ట్రాంబా అంబర్ గని, ఇది ఒకప్పుడు చాలా విలువైనది. అయితే డిమాండ్, ధరలు తగ్గడం వల్ల ప్రభుత్వం దీనిని మూసివేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..