Flying Snakes: ఈ పాములతో జాగ్రత్త.. పక్షిలా ఎగిరొచ్చి కాటేస్తాయి..! అరుదైన వీడియో వైరల్‌..

సోషల్ మీడియాలో వింత దృశ్యం కనిపించింది. ఈ వీడియోను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటుగా ఇన్‌క్రెడిబుల్‌ అని రాశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

Flying Snakes: ఈ పాములతో జాగ్రత్త.. పక్షిలా ఎగిరొచ్చి కాటేస్తాయి..! అరుదైన వీడియో వైరల్‌..
Flying Snakes
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2024 | 11:58 AM

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్నిసార్లు పాములు తమ ప్రవర్తనతో ప్రజలను షాక్ చేస్తాయి. మనం చెప్పేది కూడా అదే. ఈ వీడియోలో కనిపించిన పాము.. చాలా ప్రత్యేకంగా ఉంది. పాము అంత ఎత్తైన పైకప్పు నుండి దూకిన వింత దృశ్యం కనిపించింది. ఈ వీడియోను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటుగా ఇన్‌క్రెడిబుల్‌ అని రాశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

వీడియోలో, ఒక పాము ఇంటి పైకప్పు అంచున ఉంది. కాసేపటి తర్వాత పాము టెర్రస్ చివరకి చేరుకుని అక్కడి నుంచి అమాంతంగా కిందకు దూకింది. గాల్లో ఎగురుతూ ఆ పాము దూకి రోడ్డుపై పడింది. ఆ సమయంలో అటువైపుగా ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం వాళ్ల పని అయిపోయేది. ఈ అరుదైన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. పాము కూడా ఇలా దూకుతుందా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, గత కొద్ది రోజులుగా పాములకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్‌ అవుతున్నాయి. అలాగే, పాము కాటుకు గురై మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇటీవల తెలంగాణలోనూ ఓ యువకుడు పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామానికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ మోచి శివరాజు అనే 18ఏళ్ల యువుడు పాముకాటుతో మృతిచెందాడు. శివరాజు తన తండ్రితో పాటు పాములు పట్టేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో తండ్రి పట్టి ఇచ్చిన పామును రీల్స్‌ కోసం నోట్లో పెట్టుకుని వీడియోకి ఫోజులిచ్చాడు.. అంతే ఆ పాము కాటు వేయటంతో మోచి శివరాజు ప్రాణం పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..