ఐఎండీ అలర్ట్- రాగల ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు! : భారత వాతావరణ కేంద్రం

ఈ వారం కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు సెప్టెంబరు 8, 9, 13 తేదీల్లో రాజస్థాన్‌లో, సెప్టెంబర్ 8న హర్యానాలో, 9 నుంచి 11 వరకు ఉత్తరాఖండ్‌లో, 10, 11 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఐఎండీ అలర్ట్- రాగల ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు! : భారత వాతావరణ కేంద్రం
Floods
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2024 | 9:17 AM

ఈసారి దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఆశించినదానికంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. IMD ప్రకారం ఆదివారం నుండి వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గత 24 గంటల్లో రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, రానున్న ఏడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని ఐఎండీ వివరించింది.

సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబరు 8 నుంచి 10 మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో వచ్చే ఏడు రోజుల్లో మధ్యప్రదేశ్‌లో, ఛత్తీస్‌గఢ్, కొంకణ్, గోవాలో సెప్టెంబర్ 8 నుంచి 12 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వారం కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు సెప్టెంబరు 8, 9, 13 తేదీల్లో రాజస్థాన్‌లో, సెప్టెంబర్ 8న హర్యానాలో, 9 నుంచి 11 వరకు ఉత్తరాఖండ్‌లో, 10, 11 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..