Viral Video: అరే.. చెప్పులు కూడా మాటవినవే..! ఈ మందుబాబుల కష్టాలు పగవాడికి కూడా రావొద్దు.. !!
క తాగుబోతులు మైకంలో ఏం చేస్తుంటారో వారికే తెలియదు. కొందరు నవ్వు తెప్పించే పనులు చేస్తుంటే, మరి కొందరు రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక ఈ వీడియో చూసిన మరికొందరు మద్యం ప్రియులు ఫన్నీగా స్పందించారు. తాగుబోతులు పడే కష్టాలు, డిమాండ్లను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
తాగుబోతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. పాపం.. వారు పడే కష్టాలు పగవాళ్లకు కూడా రావొద్దని మంచి మనసుతో కోరుకుంటారు.. ఇక తాగుబోతులు మైకంలో ఏం చేస్తుంటారో వారికే తెలియదు. కొందరు నవ్వు తెప్పించే పనులు చేస్తుంటే, మరి కొందరు రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొందరు కరెంట్ పోల్ ఎక్కి హల్‌చల్ చేస్తుంటారు.కొందరు సెల్ టవర్లు ఎక్కుతుంటారు. గతంలో ఓ వ్యక్తి ఫుటుగా తాగేసి నడవలేని స్థితిలో 108కి కాల్ చేసిన సంఘటన వైరల్‌గా మారింది.
అలాగే, మరో వ్యక్తి తాగిన మైకంలో ఒక ఊరి చెరువులో పడుకుని నిద్రపోయాడు.. ఇది తెలియక గ్రామస్తులు పోలీసులకు గుర్తు తెలియని శవంగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దాంతో పోలీసులు, ఆస్పత్రి వర్గాలు, అంబులెన్స్ హుటాహుటినా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అనాథ శవం అనుకుని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా… తాను తాగి పడుకున్నానని చల్లదనం కోసం ఇలా నీళ్లలోకి దిగానని చెప్పి అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు.. ఇలాంటిదే ఇక్కడ కూడా మరో వీడియో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో నిత్యం అనేకం వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో తాగుబోతుల వింత చేష్టలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇన్‌స్టాలో ఇలానే ఓ తాగుబోతు చేసిన పనికి అందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మద్యం మత్తు నాశాలనికి ఎక్కేదాకా తాగిన ఓ యువకుడు.. చెప్పులు వేసుకోలేక నానా తంటాలు పడుతున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూడండి..
View this post on Instagram
ఇక ఈ వీడియో చూసిన మరికొందరు మద్యం ప్రియులు ఫన్నీగా స్పందించారు. తాగుబోతులు పడే కష్టాలు, డిమాండ్లను పేర్కొంటున్నారు.
ఇలాంటి కామెంట్లు కూడా పెడుతున్నారు..
ఇలాంటి కష్టాలు ఎవ్వరికి రాకూడదు.. మాకు ఎన్నో డిమాండ్లు ఉన్నాయి.
1) మద్యం తాగిన తర్వాత ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉంటే ప్రభుత్వం వాహనం ఏర్పాటు చేసి ఇంటి వద్ద దింపేయాలి.
2) లేదా వైన్స్ షాపు ముందు లేదా సమీపంలో గూడు ఏర్పాటు చేయాలి. అందుకే బెడ్, దుప్పటి, వాష్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి.
3) ఇలాంటి పరిస్థిలో ఉంటే సహాయంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
4) మద్యం ఎక్కువైతే తాగింది త్వరగా దిగేందుకు ఏదైనా పానియం ఏర్పాటు చేయాలంటూ చాలా మంది ఫన్నీగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..