AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్య బాబోయ్‌ ఇవేం పాములు.. ఉమెన్స్‌ కాలేజీ టాయిలెట్‌లో కుప్పలు తెప్పలుగా దర్శనమిచ్చిన వైనం..

పాములు కనిపించడంతో ఈ కళాశాలలో విద్యార్థినులు మరుగుదొడ్లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. వీలైనంత త్వరగా మరుగుదొడ్డి చుట్టూ శుభ్రం చేయించాలని కోరుతున్నారు. కాలేజీ వాష్‌రూమ్‌లో అపరిశుభ్రతకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Watch: అయ్య బాబోయ్‌ ఇవేం పాములు.. ఉమెన్స్‌ కాలేజీ టాయిలెట్‌లో కుప్పలు తెప్పలుగా దర్శనమిచ్చిన వైనం..
Snakes Breeding Inside Wome
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2024 | 12:35 PM

Share

మన ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లే మరుగుదొడ్లను కూడా క్రమం తప్పకుండా ఎప్పటికప్పడు క్లీన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. పరిశుభ్రత పాటించకపోతే మరుగుదొడ్డి కారణంగానే అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై ఎంత అవగాహన కల్పించినా కొన్ని పాఠశాలలు, కళాశాలలు, పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడంలో యంత్రాగం నిర్వహణ లోపం కనిపిస్తూనే ఉంటుంది. అలాంటిదే..ఒక ప్రభుత్వ కళాశాలలోని మరుగుదొడ్డి పారిశుద్ధ్య లోపం కారణంగా పాములకు ఆవాసంగా మారింది. అక్కడ మరుగుదొడ్ల బేసిన్‌లో కుప్పలు తెప్పలుగా పాములు దర్శనమిచ్చాయి. ఈ షాకింగ్ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరిగ్నర్ అన్నా ప్రభుత్వ మహిళా కళాశాలలో పారిశుధ్యం లోపించడంతో ఆ కళాశాలలోని టాయిలెట్‌లో పాములు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. మరుగుదొడ్డి చుట్టూ పొదలు ఉన్నాయని, సరైన పరిశుభ్రత లేదని విద్యార్థులు వాపోతున్నారు. పాములు కనిపించడంతో ఈ కళాశాలలో విద్యార్థినులు మరుగుదొడ్లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. వీలైనంత త్వరగా మరుగుదొడ్డి చుట్టూ శుభ్రం చేయించాలని కోరుతున్నారు. కాలేజీ వాష్‌రూమ్‌లో అపరిశుభ్రతకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

సోషల్ మీడియా వేదిక NutBoult అనే X ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. సెప్టెంబర్ 4న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వ్యూస్‌ లైకులు వచ్చాయి. కాగా ఈ వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..