Viral Video: నువ్వేమన్నా తోపా, తురుమువా..? సింహానికి భయం రుచిచూపించిన హిప్పో.. వీడియో చూస్తే అవాక్కే..!

సింహం గర్జన విన్నా కూడా ఆమడ దూరం పరిగెడతాం. అలాంటి క్రూరజంతువు సింహం ఏ ఇతర జంతువుకూ భయపడదు. అలాంటి ఆ సింహానికే భయం అంటే ఏంటో రుచిచూపించింది ఓ హిప్పో. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: నువ్వేమన్నా తోపా, తురుమువా..? సింహానికి భయం రుచిచూపించిన హిప్పో.. వీడియో చూస్తే అవాక్కే..!
Lion Swims
Follow us

|

Updated on: Sep 06, 2024 | 12:41 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో మనుషులు, జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. మనుషులు చేసే చిత్రవిచిత్రమైన పనులతో పాటుగా జంతువుల అడవి జీవితాన్ని ఈ సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం.. అలాగే కొన్ని కొన్ని సందర్బాల్లో బలమైన జంతువులు కూడా చిన్ని ప్రాణులకు భయపడి తొకముడిచే ఘటనలు ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.

సింహం అడవికే రారాజు. దాన్ని చూస్తే అడవిలోని అన్ని జంతువులు ప్రాణభయంతో పరిగెత్తాల్సిందే. సింహం కంటపడిన ఏ జీవి బతికి బట్టకట్టలేదనే చెప్పాలి. అందుకే అంత దూరంగా సింహాన్ని చూసిన కూడా ఒంట్లో వణుకుపుడుతుంది. గర్జన విన్నా కూడా ఆమడ దూరం పరిగెడతాం. అలాంటి క్రూరజంతువు సింహం ఏ ఇతర జంతువుకూ భయపడదు. అలాంటి ఆ సింహానికే భయం అంటే ఏంటో రుచిచూపించింది ఓ హిప్పో. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

వైరల్‌ వీడియో ఆఫ్రికాకు చెందినదిగా తెలిసింది. ఆఫ్రికాలోని షెంటన్ సఫారిస్ కైంగో క్యాంప్‌ లో గల లుయాంగ్వా నదిలో ఒక సింహం నీటిలో హాయిగా ఈదుతూ ఎంజాయ్‌ చేస్తోంది. అదే సమయంలో నదిలో ఓ హిప్పో కూడా ఉంటుంది. సింహాన్ని చూసిన హిప్పో దాన్ని భయపెట్టాలనుకుందో ఏమోగానీ,.. మెల్లగా దాని వెనకాల వచ్చి వెంబడిస్తుంది. పలుమార్లు సింహంపై దాడి చేస్తుంది. దీంతో సింహం ఉలిక్కిపడుతుంది. ప్రాణ భయంతో అక్కడి నుంచి వేగంగా ఈదుకుంటూ నది బయటకు వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..