Watch: టైమ్స్‌ టవర్‌లో అగ్నిప్రమాదం.. ఏడంతస్తుల భవనంలో భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 9 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం ఉదయం కమల మిల్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ ఏడు అంతస్తుల వాణిజ్య సముదాయంలో మంటలు అంటుకున్నట్లుగా తెలిసింది.

Watch: టైమ్స్‌ టవర్‌లో అగ్నిప్రమాదం.. ఏడంతస్తుల భవనంలో భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు
Times Tower
Follow us

|

Updated on: Sep 06, 2024 | 9:45 AM

ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని టైమ్స్‌ టవర్‌లో మంటలు చెలరేగాయి. టైమ్స్‌ టవర్‌ ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతం. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో లోయర్‌ పరేల్‌ ప్రాంతంలో ఉన్న టైమ్స్‌ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన మంటలు, పొగల కారణంగా చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ ఇంజిన్‌ కోసం కాల్‌ చేశారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 9 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం ఉదయం కమల మిల్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ ఏడు అంతస్తుల వాణిజ్య సముదాయంలో మంటలు అంటుకున్నట్లుగా తెలిసింది.

ఈ వీడియో చూడండి..

ఉదయం 6.30 గంటలకు తమకు సమాచారం అందినట్టుగా అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మం టలను అదుపుచేసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రమాదానికి సంబంధించి  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ తెలిపింది. కాగా,ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..