AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రైడ్‌ క్యాన్సిల్‌ చేసినందుకు యువతిని వెంబడించి వేధించిన ఆటో డ్రైవర్‌..షాకింగ్‌ వీడియో వైరల్‌

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా, విషయాన్ని తేలిగ్గా తీసుకున్న ఆటో డ్రైవర్‌ సరే అయితే వెళ్లు..పోలీసులకు చెప్పుకో అంటూ ఆమెను చెంపపై కొట్టాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

Watch: రైడ్‌ క్యాన్సిల్‌ చేసినందుకు యువతిని వెంబడించి వేధించిన ఆటో డ్రైవర్‌..షాకింగ్‌ వీడియో వైరల్‌
Auto Driver Bengaluru
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2024 | 9:16 AM

Share

మహిళల భద్రతపై తీవ్రమైన ఆందోళన, అనేక ప్రశ్నలను లేవనెత్తే షాకింగ్ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓలా యాప్‌ ద్వారా ఓ మహిళ ఆటోను బుక్ చేయగా.. రైడ్‌ను క్యాన్సిల్‌ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ ఆటో డ్రైవర్‌ కోపంతో ఆమెను వెంబడించాడు. తీవ్ర ఆగ్రహంతో ఆ డ్రైవర్ ఆమెను వేధింపులకు గురి చేశాడు. నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడాతూ, ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనను వీడియో తీసేందుకు యువతి ప్రయత్నించగా, డ్రైవర్ ఆమెను బెదిరించి మొబైల్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు బెంగుళూరులో మహిళల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓలా యాప్‌ ద్వారా ఓ మహిళ ఆటోను బుక్ చేసుకుంది. అయితే, అనుకోకుండా ఆమె తన రైడ్‌ను రద్దు చేయడంతో ఆటో డ్రైవర్ కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో ఆమెను వెంబడించి, ఆమెపై వేధింపులకు, దాడికి పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీసిన బాధితురాలు వెంటనే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

ఇవి కూడా చదవండి

మరో ఆటోలో వెళ్తున్న యువతిని వెంబడించిన డ్రైవర్‌ వారిని అడ్డుకున్నాడు. ఆటోలో కూర్చున్న అమ్మాయితో ఆటో డ్రైవర్ పెద్ద గొంతుతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం వీడియోలో కనిపించింది. రైడ్‌ ఎందుకు క్యాన్సిల్‌ చేసుకున్నావ్‌.. ఆటోకి గ్యాస్‌ మీ నాన్న ఇస్తారా? అంటూ మండిపడ్డాడు. దాంతో ఆ అమ్మాయి అతడికి బదులిస్తూ..అనుకోని కారణాల వల్ల రైడ్‌ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ, పట్టించుకోని ఆటో డ్రైవర్‌ ఆగ్రహంతో ఊగిపోవటం చూసి భయపడిపోయింది. ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా, విషయాన్ని తేలిగ్గా తీసుకున్న ఆటో డ్రైవర్‌ సరే అయితే వెళ్లు..పోలీసులకు చెప్పుకో అంటూ ఆమెను చెంపపై కొట్టాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..