వెయ్యేళ్ళ చరిత్ర గల గణనాథుడి ఆలయం.. వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..

ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి హంస వాహనంపై గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో 21 రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

వెయ్యేళ్ళ చరిత్ర గల గణనాథుడి ఆలయం.. వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..
దేశంలోని ఈ మూడు ఆలయాలు ప్రత్యేకించి గణపతి దేవాలయాలుగా ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లి పూజలు చేసిన ఏ భక్తుడు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడు. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భారతదేశంలోని ఈ మూడు దేవాలయాలు మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రసిద్ధి చెందాయి.
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 06, 2024 | 8:30 AM

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో ఆలయప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టు కుంటుంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజులు పాటు జరగ నుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 7 వినాయక చవితి, 8 న గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ప్రజారోహణం జరగనుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు నవరాత్రి ఉత్సవాలు, 17 నుంచి 27 న జరిగే తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ మేరకు విస్తృత ఏర్పాటు చేసిన ఆలయ యంత్రాగం స్వయంభు వరసిద్ధి సన్నిధిని అందంగా అలంకరించింది. విజ్ఞాలకు అధిపతి అయిన గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసింది.

దేశంలో ఎక్కడా లేని రీతిలో 21 రోజులపాటు కాణిపాకం ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు. చవితి రోజు గణనాథుడి వ్రతం కళ్యాణం నిర్వహించనున్నట్టుగా తెలిపారు.

ఇక రాజగోపురం ద్వారాలు, ధ్వజ స్తంభంతో పాటు ఆలయాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి ఆపై మెరుగులు దిద్దింది. ఇక భక్తుల రద్దీకి అనుకూలంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. వినాయక చవితి రోజు అర్ధరాత్రి 2 గంటలకు ఉభయదారులు నిర్వహించే అభిషేకం, అనంతరం 3 గంటల నుంచి భక్తులకు స్వామి వారి సర్వదర్శనం కల్పించనున్న దేవస్థానం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఉదయం 6 గంటలలోపే వీఐపీలు స్వామి దర్శనం చేసుకోవాలనీ దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించగా వికలాంగులు, వయో వృద్దులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అందంగా అలంకరించిన దేవస్థానం గణపతి హోమం, అక్షరాభ్యాసం సేవలను యధావిధిగా నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి

వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక అదే రోజు పుష్పకావిడి సమర్పించనుండగా రాత్రి కాణిపాకం ఆలయ వీధుల్లో సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ఇక 8 న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి హంస వాహనంపై గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వినాయక చవితి రోజు ఉదయం 9 గంటలకు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

వినాయక చవితి రోజున లక్ష మందికి పైగానే భక్తులు వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన దేవస్థానం, ఆలయ ప్రోటోకాల్ ప్రముఖులకు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసింది. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్న దేవస్థానం క్యూ లైన్లు, స్వామివారి ప్రసాదాలు, అల్పాహారం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు లక్షకు పైగా లడ్డూలను సిద్ధం చేసిన ఆలయ యాత్రంగం భద్రత పెద్ద పీట వేసింది. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనుంది. 400 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేయనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..