Watch: పామును నోట్లో పెట్టుకుని సెల్ఫీకి ట్రై చేసిన స్నేక్ క్యాచర్.. ఆ తర్వాత జరిగింది ఊహించలేరు..
సెల్ఫీలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టడం ట్రెండ్‌గా మారిపోయింది. అలాగని కొందరు అతి చేస్తుంటారు. ప్రమాదకర పులులు, సింహాలతో, పాములతోనో సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. తెలిసి ఇరకాటంలో పడుతుంటారు.. ఇక్కడో యువకుడు అలాంటి పనినే చేశాడు.
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, రీల్స్ చేస్తూ హడావుడి చేస్తుంటారు చాలా మంది. ఒక రకంగా చెప్పాలంటే.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా ఒక సెల్పీ రిలీజ్ చేయటం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. కొత్త ప్రదేశాలకు వెళ్లినా, ఫంక్షన్లకు వెళ్లినా, గుడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టడం ట్రెండ్‌గా మారిపోయింది. అలాగని కొందరు అతి చేస్తుంటారు. ప్రమాదకర పులులు, సింహాలతో, పాములతోనో సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. తెలిసి ఇరకాటంలో పడుతుంటారు.. ఇక్కడో యువకుడు అలాంటి పనినే చేశాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన స్నేక్ క్యాచర్ పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఈ విషద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాములు పట్టే మోచి శివరాజు అనే 18ఏళ్ల యువుడు పాముకాటుతో మృతిచెందాడు. శివరాజు తండ్రి మోచి గంగారం పాములు పట్టేవాడు. ఈక్రమంలోనే ఆ విద్య తన కొడుకుకి కూడా నేర్పించారు. ఈ నేపథ్యంలోనే తండ్రి పామును పట్టి కొడుకు ఇచ్చాడు..దాంతో శివరాజ్ సెల్ఫి కోసం ప్రయత్నించాడు. దానికోసం ఏకంగా పామును నోట్లో పెట్టుకొని ఫోటోకు, వీడియోలకు ఫోజులివ్వడం మొదలుపెట్టాడు..
కానీ, అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. పాముతో సెల్పీకి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. పామును పట్టుకుని అత్యుత్సాహం ప్రదర్శించాడు. పామును నోట్లో పెట్టుకోవటంతో అదికాస్తా కాటువేసింది. దీంతో స్నేక్ క్యాచర్ శివ రాజు మరణించాడు. శివరాజులు మృతితో దేశాయిపేట్ గ్రామం పోచారం కాలనీలో విషాదం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..