AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రుపెట్టి నిద్రపోతున్న వ్యక్తి.. ముక్కులో దూరిన బొద్దింక..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన శరీరంలోకి ఎప్పుడైనా ఒక కీటకం ప్రవేశించినప్పుడు, దాని గురించి మనకు వెంటనే తెలిసిపోతుంది. కానీ, ఈ వ్యక్తిలో మాత్రం ఎలాంటి రియాక్షన్‌ లేదు. ముక్కులో బొద్దింక దూరినప్పటికీ అతడు అలాగే నిద్రపోతున్నాడు. కానీ, అతని శ్వాసలో ఏదో తెలియని వాసనగా అనిపించిందట. దాంతో కాస్త అటు ఇటూ కదిలాడు..ఆ తరువాత మళ్ళీ నిద్రపోయాడు.  ఆ తరువాత..

గుర్రుపెట్టి నిద్రపోతున్న వ్యక్తి.. ముక్కులో దూరిన బొద్దింక..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Chinese Man Cockroach
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2024 | 11:02 AM

Share

ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర కీలకంగా పనిచేస్తుంది. నిద్ర అనేది శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా. అందుకే ఏ వ్యక్తికైనా ఆరోగ్యం నిద్రలోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ద్రలేమి మెదడు శక్తిని తగ్గిస్తుంది. అందువల్ల మన రోజువారీ కార్యకలాపాలు చాలా ప్రభావితమవుతాయి. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం తొందరగా రావడం తదితర సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, తమ చుట్టూ ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా స్పృహతప్పి నిద్రపోయేవారు వారు కూడా కొందరు ఉంటారు. ఇలాంటి వారికి తరచూ శరీరంలోకి క్రిములు ప్రవేశించడం, నిద్రలో ఉండగానే ఇతర ఏవైనా కీటకాలు కాటు వేయటం వంటి ఘటనలు చూస్తుంటాం. ఇలాంటిదే ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్త ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

నివేదిక ప్రకారం, హైకౌ అనే 58 ఏళ్ల వ్యక్తి హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నాడు. ఒక రాత్రి అతను గాఢ నిద్రలో ఉండగా, అతని ముక్కులోకి ఒక బొద్దింక ప్రవేశించింది. దాని గురించి అతనికి ఏమాత్రం తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన శరీరంలోకి ఎప్పుడైనా ఒక కీటకం ప్రవేశించినప్పుడు, దాని గురించి మనకు వెంటనే తెలిసిపోతుంది. కానీ, ఈ వ్యక్తిలో మాత్రం ఎలాంటి రియాక్షన్‌ లేదు. ముక్కులో బొద్దింక దూరినప్పటికీ అతడు అలాగే నిద్రపోతున్నాడు. కానీ, అతని శ్వాసలో ఏదో తెలియని వాసనగా అనిపించిందట. దాంతో కాస్త అటు ఇటూ కదిలాడు..ఆ తరువాత మళ్ళీ నిద్రపోయాడు.

కానీ, చివరకు మూడు రోజుల తర్వాత ఆ వ్యక్తి తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడ్డాడు. అతనికి ముక్కుల్లోంచి పసుపు శ్లేష్మం రావడం ప్రారంభించింది. దాంతో అతడు వెంటనే ఆస్పత్రికి వెళ్లి..డాక్టర్‌కి చూపించుకున్నాడు. అతన్నిని అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. సీటీ స్కాన్‌ కూడా తీశారు.. ఈ స్కాన్‌లో బొద్దింక రెక్కలు స్పష్టంగా కనిపించటం గుర్తించారు. అది గమనించిన డాక్టర్ వెంటనే అతని అడ్మిట్‌ చేసుకుని.. తన శ్వాసనాళాన్ని క్లీయర్‌ చేశారు. ఒక రోజు తర్వాత అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ కేసు చూసిన వైద్యులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచిత్రంగా ఉందని వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..